Aadi: ‘పులి-మేక’ ఆటాడుతున్న ఆది, లావణ్య!

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తున్న ZEE5....

Aadi: ‘పులి-మేక’ ఆటాడుతున్న ఆది, లావణ్య!

Zee5 Launches Puli Meka New Web Series Starring Aadi Lavanya Tripathi

Aadi: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తున్న ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫాం.. ప్రారంభం నుండే ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ZEE5 కంటెంట్ పరంగా చూస్తే ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకుపోతుంది. ZEE5 ఒక జోనర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్‌లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్‌ను వీక్షకులకు అందించనుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’, ఇటీవల ‘రెక్కీ’తో జీ5 మంచి హిట్‌ను అందుకుంది. ఇప్పుడు తాజాగా “పులి – మేక” అనే కొత్త వెబ్ సిరీస్‌ను లాంఛ్ చేసింది జీ5.

Aadi : టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఆది సాయికుమార్..

జీ5 అసోసియేషన్ విత్ కోన ఫిలిం కార్పోరేషన్ చేస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ “పులి – మేక”. ఈ వెబ్ సిరీస్‌లో అందాల భామ లావణ్య త్రిపాఠి, యంగ్ హీరో ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నారు. గోపీచంద్ హీరోగా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె.చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ మరియు జీ5 సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్న ‘పులి – మేక’ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు.

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠిని చీప్ యాక్టర్ అన్న నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లావణ్య

పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ… ఈ మధ్య వెబ్ సిరీస్‌లు కూడా సినిమాలతో పోటీ పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగావెబ్ సిరీస్‌లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్‌లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ ‘పులి-మేక’ వెబ్ సిరీస్‌లలో లావణ్య త్రిపాఠి, ఆదిసాయి కుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ “పులి – మేక” వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే పోలీస్ డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది. పోలీస్ డిపార్టుమెంట్‌లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకరిని చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలు మరియు ఆస్ట్రాలజీతో మిళితమైన కథాంశం ఉండటం ఈ వెబ్ సిరీస్ కథలో ఉన్న ప్రత్యేకత. ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్‌లలాగే ఇది కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.