Zomato layoffs: కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు… ఇప్పుడో జొమాటో వంతు

ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇటీవలే ట్విట్టర్, మెటా, అమెజాన్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాట పట్టింది. ఈ సంస్థ కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తోంది.

Zomato layoffs: కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు… ఇప్పుడో జొమాటో వంతు

Zomato layoffs: వివిధ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాటపట్టింది.

Kim Daughter At Missile Launch Site : ఖండాంతర క్షిపణి ప్రయోగం కంటే కిమ్ కూతురిపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చ.. క్షిపణి ప్రయోగమా? వారసురాలి ప్రకటనా?

తాజా నిర్ణయం ద్వారా కంపెనీ నుంచి కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగించినట్లుగా జొమాటో ప్రకటించింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని జొమాటో తొలగిస్తోంది. మరోవైపు జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన 4.5 సంవత్సరాలుగా కంపెనీలో పని చేస్తున్నాడు. జొమాటో ఉద్యోగుల్ని భారీ స్థాయిలో తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2020లో ఏకంగా 520 మంది సిబ్బందిని తొలగించింది. అంటే ఒకేసారి 13 శాతం మంది ఉద్యోగుల్ని తీసేసింది. అప్పట్లో కంపెనీ నష్టాల్లో ఉండటం, వ్యాపారం సరిగ్గా సాగకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Twitter: ఉద్యోగులపై మళ్లీ వేటు? బెడిసి కొట్టినా బెదిరేదే లేదంటున్న మస్క్

ప్రస్తుతం కంపెనీలో 3,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ నుంచి మోహిత్ గుప్తా రాజీనామా చేయడంపై జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ స్పందించారు. మోహిత్ కంపెనీని లాభాల బాట పట్టించడంలో, ముందుకు నడిపించడంలో ఎంతో కృషి చేశాడని ప్రశంసించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించేందుకు నిర్ణయించాయి. పలు స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు ఇదే బాట పట్టబోతున్నాయి.