ఆర్జీవీపై కేసు.. లాయర్ ఏమన్నారంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తన కొడుకు హత్యకేసు కోర్టులో పెండింగులో ఉండగా సినిమా తీస్తే సాక్షులు, బాధితులపై ప్రభావం చూపుతుందని బాలస్వామి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

‘మర్డర్’ సినిమా పోస్టర్లలో వర్మ ఉపయోగించి ప్రణయ్, అమృత, మారుతీరావుల ఫోటోలు, సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. బాలస్వామి సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రణయ్ కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా నిర్మించొద్దు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహా 10 TVతో అన్నారు. కోర్టులో కేసు నడుస్తుండగా సినిమా తీయడం, పబ్లిక్‌గా కామెంట్ చేయడం అనేది అట్రాసిటీ యాక్ట్ కిందకి వస్తుంది కాబట్టి కంప్లైంట్ చేశారని లాయర్ తెలిపారు.

Related Posts