కారులో మాస్క్ పెట్టుకోలేదని ఫైన్.. Rs.10 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టులో పిటీషన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో లేని పోని వివాదాలు తెచ్చుకుంటారు. కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్..బైక్ డ్రైవ్ చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ వంటి ఘటనలు గురించి విన్నాం..అలాగే కారులో ఒంటరిగా వెళుతున్న వ్యక్తి మాస్క్ పెట్టుకోలేదని ఓ పోలీస్ ఫైన్ కట్టమన్నాడు.


దానికి అతను ‘‘కారులో నా పక్కన ఎవ్వరూ లేరు..జనాల్లోకి వెళితే మాస్క్ పెట్టుకుంటాను..కారులో నాతో పాటు మరెవరైనా ఉంటే కూడా మాస్క్ పెట్టుకుంటాను. కానీ నేను ఒక్కడినే ఉన్నాను..మాస్క్ పెట్టుకోవాల్సిన పనిలేదని’’ చెప్పాడు. కానీ ఆ పోలీస్ వినిపించుకోలేదు. ఎంత చెప్పినా..ఆ పోలీస్ వినలేదు..రూ.500 ఫైన్ కట్టాల్సిందేనని తెగేసి చెప్పాడు. దీంతో అతనికి తిక్కలేచింది. కరోనా రూల్స్ నాక్కూడా తెలుసు..నన్ను ఇబ్బందికి గురి చేశావ్ దీనికి నువ్వు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తానంటూ కోర్టులో సదరు పోలీసుపై పరువు నష్టం పిటీషన్ వేశాడు.


వివరాల్లోకి వెళితే..ఢిల్లీలో సౌరభ్ శర్మ అనే లాయర్ సెప్టెంబర్ 9న కారులో వెళ్తూండగా ట్రాఫిక్ పోలీస్ ఆపి..మాస్క్ ధరించలేదంటూ రూ. 500 ఫైన్ వేశారు. దీనిపై లాయర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. కారులో నేనొక్కడినే ఉన్నా..కారులో ఒక్కరే మాస్క్ అవసరం లేదని కేంద్ర మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉందని తెలిపాడు.


జనాల మధ్యకు వెళితే..మాస్క్ ధరిస్తానని..ఒంటరిగా ఉన్న సమయంలో అది అవసరం లేదని అన్నాడు. అయినా కూడా వారు వినకుండా తనకు జరిమానా విధించారని..పోలీసుల చర్యతో తన పరువుకి భంగం కలిగిందని..తాను అన్ని నిబంధనలనూ పాటిస్తున్నానని కోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసుల నుంచి తనకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.


ఈ పిటీషన్ ను కోర్టు స్వీకరించింది. తాను కరోనా నిబంధనలను అన్నిటినీ పాటిస్తున్నానని..అయినా తనను అన్యాయంగా పోలీసులు వేధించి, ఫైన్ కట్టించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చాడు. తన సమయాన్ని వృథా చేయటమే కాకుండా నాకు మానసిక ఒత్తిడి కలిగించారని.. తాను ఒంటరిగా ఉన్న వేళ, మాస్క్ ధరించక పోవడం ఇతరులకు హాని కలిగించినట్టు కాదని పిటిషన్ లో తెలిపాడు. ఈ కేసును నవంబర్ 18న విచారిస్తామని జస్టిస్ నవీన్ చావ్లాతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది.

Related Posts