లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

‘హత్రాస్ బాధితురాలి కుటుంబానికి సీఎం ఇచ్చిన మాట ఏమైంది’

Published

on

Hathras: హత్రాస్ కేసు వాదిస్తున్న అడ్వకేట్ సీమా కుశ్వహ ఆ కుటుంబానికి ఢిల్లీలో పర్మినెంట్ నివాసం ఏర్పాటు చేయాలంటున్నారు. అలహాబాద్ హై కోర్టుకు చెందిన లక్నో బెంచ్ సోమవారం ఈ వాదనను వినాల్సి ఉంది.‘అక్టోబరు 24న అఫిడవిట్‌లో పొందుపరిచిన నా డిమాండ్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందనుకుంటున్నా. మా డిమాండ్ ఏంటంటే సీఎం మాటిచ్చినట్లుగానే ఓ ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. అదింకా పూర్తి చేయలేదు. ఇంకొకటి ఆ కుటుంబానికి పర్మినెంట్ గా ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే హత్రాస్ అనే ప్రాంతంపై పూర్తిగా అగ్ర కులస్థుల ప్రభావం ఉంది’ అని కుశ్వాహ అన్నారు.పోస్టు మార్టంలో బాధితురాలు రేప్ కు గురైనట్లు తెలుస్తుంది. 19ఏళ్ల ఆ యువతి గాయాలకు ఢిల్లీ సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ జరిగింది. సెప్టెంబర్ 14న దాడి జరిగితే.. సెప్టెంబర్ 29వరకూ ప్రాణాలతో పోరాడుతూనే ఉంది.

ఇంకెంతమంది అమ్మాయిలు.. ఇంకెన్ని హత్రాస్ ఘటనలు: రాహుల్ గాంధీ


అక్టోబరు 12న అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్.. హత్రాస్ బాధితురాలి శరీరాన్ని అర్ధరాత్రి దహనం చేయడంపై మానవ హక్కుల ఉల్లంఘన అని స్టేట్‌మెంట్ ఇచ్చింది.అక్టోబర్ 27న సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈ కేసును మానిటర్ చేయాలంటూ సుప్రీం కోర్టు.. అలహాబాద్ హైకోర్టుకు సూచించింది. దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఆరోపణలపై విచారణను వేగవంతం చేశారు. ముగ్గురు జడ్జిలతో బెంచ్ ఏర్పాటు చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *