Home » ఫుట్బాల్ దిగ్గజం ‘డిగో మారడోనా’ కన్నుమూత
Published
2 months agoon
Legendary footballer Diego Maradona passes away ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా(60) కన్నుమూశారు. బుధవారం ఆయన తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. మారడోనా మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
మారడోనా అస్తమించడంతో ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఒక శకం ముగిసినట్లైంది. ఫుట్బాల్ పేరు చెబితే మొదటగా గుర్తొచ్చే పేరు డిగో మారడోనా. ఆ క్రీడను అంతలా ప్రభావితం చేశారాయన. అర్జెంటీనాకు ఎన్నో ట్రోఫీలు అందించారు. 1986లో అర్జెంటీనా ఫుట్బాల్ ప్రపంచకప్ దక్కించుకోవడంలో మారడోనా కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీ తర్వాత మారడోనా పేరు మార్మోగిపోయింది.
మారడోనాకు వైద్యులు నెల కిందటే మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేశారు. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల మారడోనాకు మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆయనకు సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు. ఆ ప్రమాదం నుంచి కోలుకున్నా.. అనతి కాలంలోనే ఆయన ఈ లోకం నుంచి వెళ్లిపోవడం కోట్లాది అభిమానుల కంటతడి పెట్టిస్తోంది.