లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కడప జిల్లాలో విద్యుత్ షాక్‌తో చిరుత మృతి

Published

on

Leopard dies of electric shock : కడప జిల్లా ముద్దనూరులో చిరుత మృతి కలకలం రేపుతోంది. శెట్టివారిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవిగా పడిఉన్న చిరుతను గుర్తించిన స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది.. విద్యుత్ వైర్లు తగిలి చిరుత మృతి చెందినట్లు నిర్ధారించారు.

రెండు సంవత్సరాల వయస్సు కలిగిన చిరుత పులి అయితే గండికోట ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిండిపోవడంతో కొండవైపు నుంచి నీరు తాగడం కోసం సమీప ప్రాంతానికి వచ్చింది. అక్కడే ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లకు తగిలింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.

గొర్రె కాపరుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు.. ఇవాళ చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. చిరుత తోక భాగంలో బలమైన విద్యుత్ గాయాలు ఉండటం వల్ల విద్యుత్ షాక్ వల్లే చనిపోయిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు.