మనుషుల నుంచే వ్యాపించిందా? అడవి చింపాజీల్లో అరుదైన వ్యాధి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Leprosy infected Wild Chimpanzees : వెస్ట్ ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో ఎక్కువగా చింపాజీలు కనిపిస్తుంటాయి. ఈ జాతి చింపాజీలపై సైంటిస్టులు అనేక పరిశోధనలు చేస్తున్నారు. చింపాజీల్లో మొదటిసారి లెప్రోసీ (కుష్ఠువ్యాధి) సోకినట్టు సైంటిస్టులు కనిపెట్టారు. వాస్తవానికి ఇది ఊహించని ట్విస్ట్ అంటున్నారు.ఈ వ్యాధి చింపాజీలకు ఎలా సోకింది అనేదానిపై అనేక అధ్యయనాలు చేస్తున్నారు. మనుషుల నుంచి చింపాజీలకు లెప్రోసీ వ్యాధి సోకే అవకాశం లేదని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి వ్యాధి వసంత రుతువులోనే వస్తుంటుందని, దీనికి మూలం ఏంటా ఇంకా తెలియదని చెబుతున్నాురు.

పశ్చిమాన Guinea-Bissauకు చెందిన Cantanhez National Parkలో కనీసం రెండు రకాల అడవి జాతి చింపాజీలు ఉన్నాయి. వీటి నుంచే లెప్రోసీ వ్యాధి సోకినట్టు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

మనుషుల్లో కనిపించినట్టుగానే ఈ వ్యాధి చింపాజీల్లోనూ కనిపిస్తోందని, లక్షణాలు కూడా ఒకే మాదిరిగా ఉన్నాయని అంటున్నారు.కొన్ని చింపాజీలను కెమెరాల ద్వారా ట్రాప్ చేసి ఫొటోలు తీశారు. అందులో నాలుగు చింపాజీల ముఖం, చెవులు, చేతులు, పాదాలపై బొడిపెలు, మచ్చలు ఉన్నట్టు గుర్తించారు.

ఆయా చింపాజీల మలం శాంపిల్స్ కూడా సేకరించి వ్యాధి నిర్ధారణ చేశారు. పరీక్షల్లో లెప్రోసీ అనే బ్యాక్టీరియా (Mycobacterium leprae) ఉన్నట్టు తేలింది.2009లో చిరుత దాడిలో చనిపోయిన చోరా అనే మహిళకు చెందిన నెక్రోస్పీ శాంపిల్ సేకరించి పరీక్షించారు.

అందులోనూ ఈ బ్యాక్టిరీయా ఉందని నిర్ధారించారు. ఇప్పటివరకూ ఈ కుష్ఠువ్యాధి అనేది మనుషుల్లోనే వ్యాపిస్తుందని తెలుసు.కానీ, ఇతర అడవి జాతి జంతువుల్లోనూ ఈ వ్యాధి సోకుతుందని తొలిసారి గుర్తించినట్టు సైంటిస్టులు వెల్లడించారు. గతంలో ఈ కేపటీవ్ చింపాజీలు, ఇతర  ప్రైమేటు జాతుల్లోనూ లెప్రోసీ బ్యాక్టిరీయా ఉన్నట్టు నిర్ధారించారు.
కానీ, మొదటిసారిగా అడవి జాతి చింపాజీల్లోనూ వ్యాధి సోకినట్టు గుర్తించామంటున్నారు. గతంలో వెస్ట్ ఆఫ్రికాలోని కొన్ని బేబీ చింపాజీల్లోనూ ఈ తరహా వ్యాధి సోకినట్టు సైంటిస్టులు నిర్ధారించారు. అమెరికా, జపాన్ లో మెడికల్ రీసెర్చ్ కోసం ఈ చింపాజీలను వినియోగించారు.ఆ సమయంలో కొన్ని శాంపిల్స్ పరీక్షించారు. చాలా ఏళ్ల వరకు ఇప్పుడు కనిపించిన లక్షనాలు చిన్న వయస్సు చింపాజీల్లో కనిపించలేదని అంటున్నారు. అడవి జాతి చింపాజీ జనాభాలో లెప్రోసీ వ్యాధి కేసు ధ్రువీకరించడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు సైంటిస్టులు.

Related Tags :

Related Posts :