చదివిస్తానని తీసుకెళ్లి యువతిని వ్యభిచార నిర్వహకులకు అమ్మేసిన మహిళ.. పోలీసుల చొరవతో ఆ యువతికి విముక్తి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పోలీసుల చొరవతో వ్యభిచార కూపం నుంచి యువతికి విముక్తి లభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన యువతిని హాస్టల్ లో ఉంచి చదివిస్తామని మాయమాటలు చెప్పి సిరిసిల్లలో వ్యభిచార నిర్వహకులకు అమ్మేశారు దుండుగులు. అమ్మాయి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 6 సంవత్సరాల క్రింతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

రహస్యంగా యువతి తన మామయ్య రాజలింగంకు ఫోన్ చేయడంతో ఆమె ఆచూకీ దొరికింది. పోలీసుల సహకారంతో సిరిసిల్ల ప్రేమ్ నగర్ లోని వేశ్య గృహం నుంచి యువతిని బంధువులు విడిపించుకున్నారు. యువతిని మామయ్యకు అప్పగించారు.

ఆరేళ్ల క్రితం శ్రీరాంపూర్ కు చెందిన శ్రీవాణి అనే మహిళ బాలికను మాయమాటలతో హాస్టల్ ఉంచి చదివిపిస్తానని తీసుకెళ్లింది. ఆ తర్వాత వ్యభిచార గృహంలో విక్రియించినట్లు బాధితురాలు తెలిపింది. బెల్లంపల్లికి సంబంధించిన మైనర్ బాలిక తల్లిదండ్రులను కోల్పోవడంతో శ్రీరాంపూర్ లో నివాసముంటున్న తన నానమ్మ దగ్గరకు వెళ్లింది. నానమ్మ ఊరికి వెళ్లి వస్తానని..ఇంటికి వెళ్లమని చెప్పింది.

పక్కనే ఉన్న శ్రీవాణితో కొంత పరిచయం ఏర్పడింది. వారం రోజులుగా శ్రీవాణి ఇంట్లో ఉంటుంది. బాలికను తను చదివిస్తాను.. ఉన్నతంగా చూసుకుంటానని.. మాయమాటలు చెప్పి శ్రీవాణి తీసుకెళ్లింది. ఆ తర్వాత బాలికకు తెలియకుండానే సిరిసిల్లకు సంబంధించిన వ్యభిచార గృహంలో విక్రయించి వెళ్లిపోయింది.

ఆ రోజు నుంచి ఆరేళ్లుగా బాలిక వ్యభిచార గృహంలో నరకయాతన అనుభవించింది. ఇటీవల ఐదు రోజుల క్రితం ఆ బాలిక ఒక ఫోన్ ద్వారా తన మామయ్య రాజలింగం ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకుని కాల్ చేయడంతో స్థానికంగా పోలీసులను ఆశ్రయించారు. నిన్న రాత్రి సిరిసిల్లలోని వ్యభిచార గృహంలోకి వెళ్లిన పోలీసులు బాలికను విడిపించి బంధువులకు అప్పగించారు.

Related Posts