పెన్షన్ తీసుకొనే వారికి గుడ్ న్యూస్…Life Certificate గడువు పెంపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేంద్ర ప్రభుత్వ పెన్షన్ తీసుకొనే వారు తప్పనిసరిగా తాము బతికే ఉన్నాం (లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ లో మాత్రమే సమర్పించాలనే రూల్ ఉంటుంది. ప్రస్తుతం కరోనా క్రమంలో వృద్ధులు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. వీరు ఆందోళనలు అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది.
పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. నవంబర్ 01 నుంచి డిసెంబర్ 31 మధ్య సమర్పించవచ్చని కేంద్ర వ్యక్తిగత, ప్రజా సమస్యలు, పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అంటే మరో నెల అదనంగా పొడిగించినట్లైంది.

డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్స్ పై కేంద్రం నిషేధం!


కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకొనే పెన్షన్ దారులు తాము బతికే ఉన్నామని ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. పెన్షన్ కంటిన్యూ చేయండి అంటూ సర్టిఫికేట్ ఇచ్చిన వారు బతికే ఉన్నారని భావించి పెన్షన్ ను కంటిన్యూ చేస్తారు అధికారులు.
ప్రస్తుతం పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి బ్యాంకు, పెన్షన్ ఆపీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా..ఆన్ లైన్ విధానం ప్రవేశపెట్టారు. ఆన్ లైన్ లో వీడియో ద్వారా..కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (V-CIP) ద్వారా సర్టిఫికేట్ ఇచ్చినట్లవుతుంది.


Related Posts