పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా.. ఆర్డర్ ఇచ్చిన 72 ఫ్యామిలీలు క్వారంటైన్‌లోకి

ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త... కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కంటికి కనిపించని మమహ్మారి ఎటు వైపు నుంచి కాటు వేస్తోందో తెలియని పరిస్థితి. 

పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా.. ఆర్డర్ ఇచ్చిన 72 ఫ్యామిలీలు క్వారంటైన్‌లోకి

ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త… కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కంటికి కనిపించని మమహ్మారి ఎటు వైపు నుంచి కాటు వేస్తోందో తెలియని పరిస్థితి. పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అతడు డెలివరీ చేసిన 72 ఫ్యామిలీలను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘ‌ట‌న దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

ద‌క్షిణ ఢిల్లీలోని మాల్వియా ప్రాంతంలో ఓ పిజ్జా సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. అతడిలో క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ ప్రతిరోజు పిజ్జా డెలివ‌రీ చేసేందుకు వెళ్లాడు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో అతడికి ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం.. పిజ్జా బాయ్‌ను కొవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాధితుడితో పాటు పనిచేసిన మరో 16 మంది డెలివరీ బాయ్స్‌ను కూడా క్వారంటైన్‌కు తరలించారు. బాధితుడు ఫుడ్ డెలివ‌రీ చేసిన ఇళ్ల వివ‌రాల‌ను అధికారులు సేక‌రించారు. దాదాపు 72 ఫ్యామిలీలను గుర్తించి వారిని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు.

పిజ్జా డెలివరీ చేసిన బాధితుడు తన ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని, అతడితో పాటు ఇతర పిజ్జా డెలివరీ బాయ్స్ కూడా తమ ముఖాలకు మాస్క్ లు ధరించి ఫుడ్ డెలివరీ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మాస్క్ లు ధరించి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నందున ఫుడ్ ఆర్డర్ చేసినవాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచనలు చేస్తున్నారు. (కుళ్లిన పండ్లతోనే కడుపు నింపుకుంటున్న వలస కూలీలు)

రైడర్ సహోద్యోగులందరికి నెగటీవ్ తేలినప్పటికీ కూడా ముందుజాగ్రత్తగా, రైడర్ పనిచేసిన రెస్టారెంట్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు ఫుడ్ డెలివరీ యాప్ ప్రొవైడర్ జొమాటో ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆహారాన్ని ఆర్డరింగ్ చేయడం సురక్షితమైన పద్ధతిలో కొనసాగించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. వైరస్ ఆహార పదార్థాల ద్వారా వ్యాప్తిచెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

WHO నివేదిక ప్రకారం.. కరోనావైరస్.. శ్వాసకోశ సిండ్రోమ్ కరోనావైరస్ (SARS-CoV), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (MERS-CoV) ఆహార వినియోగం ద్వారా వ్యాప్తి జరగలేదని సూచిస్తుంది. కరోనావైరస్ థర్మోలాబైల్.. సాధారణ వంట ఉష్ణోగ్రతలకు (70 ° C) ఉడికించడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలో వైరస్ వ్యాపిస్తుందని ఎలాంటి నివేదికలు లేవు.

నమ్మకమైన రెస్టారెంట్లు : పరిశుభ్రత పాటించటానికి నిరూపితమైన ట్రాక్ రికార్డ్ ఉన్న రెస్టారెంట్ల నుండి ఆర్డర్. జోమాటో, స్విగ్గీలు కూడా ఈ రెస్టారెంట్లను తమ యాప్‌లో గుర్తించాయి.

కాంటాక్ట్ డెలివరీ లేదు : ఫుడ్ డెలివరీ యాప్‌లు రెస్టారెంట్లలో కూడా ‘కాంటాక్ట్ డెలివరీ లేదు’. ప్యాకేజీని డెలివరీ చేసే వ్యక్తి కేటాయించిన ప్రదేశంలో లేదా మీ ఇంటి వెలుపల పంపిణీ చేస్తారు. అప్పుడు మీరు చేతికి గ్లోవ్స్  ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్యాకేజీని లోపలికి తీసుకురావచ్చు.

ప్యాకేజీని పారేయండి : కార్డ్ బోర్డ్, ప్లాస్టిక్ వంటి కొన్ని ఉపరితలాలపై వైరస్ ఉంటుందని పరిశోధన చెబుతుంది. అయితే ప్యాకేజింగ్ నుండి వైరస్ బారిన పడటం చాలా అరుదు. కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి, ప్యాకేజింగ్‌ను పారేయండి. ప్యాకేజీని ఉంచిన ఉపరితలాలపై శానిటైజ్ చేయడం మంచిది. ప్యాకేజీని తొలగించే సమయంలో మీరు మీ ముఖాన్ని తాకకుండా జాగ్రత్త పడండి.

మీ చేతులు కడుక్కోండి : మీరు ప్యాకేజింగ్‌ను తొలగించాలి. తినడానికి సిద్ధంగా ఉన్న తర్వాత మీ చేతులను బాగా కడగడం గుర్తుంచుకోండి. 20 సెకన్ల నియమాన్ని గుర్తుంచుకోండి.