Covid Survivors : కోలుకున్న కరోనా బాధితుల్లో ముగ్గురిలో ఒకరికి మానసిక రుగ్మతలు ఉన్నాయి

Covid Survivors : కోలుకున్న కరోనా బాధితుల్లో ముగ్గురిలో ఒకరికి మానసిక రుగ్మతలు ఉన్నాయి

1 in 3 Covid survivors are diagnosed with conditions

Covid survivors diagnose conditions: కరోనా నుంచి కోలుకున్న ముగ్గురిలో ఒకరు న్యూరోలాజికల్ లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆక్స్ ఫర్డ్ కొత్త అధ్యయనంలో తేలింది. వైరస్ సోకిన ఆరు నెలల కాలంలో ఈ తరహా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టు రీసెర్చర్లు తేల్చేశారు. ఎక్కువ అనారోగ్య సమస్యగా ఆందోళనగా గుర్తించారు. మూడ్ డిజార్డర్, ఒత్తిడి, ఇన్సోమినియా వంటి ఇతర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారంట.. నరాల సంబంధిత సమస్యల కారణంగా మెదడులో రక్తస్రావం ఏర్పడటం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. దీన్నే ischemic స్ట్రోక్ అని కూడా పిలుస్తారు.

మెదడుకు అందించే రక్తకణాల ప్రసరణ బ్లాక్ ఏర్పడటంతో నాళం మూసుకుపోయి ఈ స్ట్రోక్‌కు కారణమవుతుందని తేల్చారు. అలాగే డెమన్షియా మతిమరుపుకు కూడా వస్తుందని అధ్యయన బృందం తెలిపింది. అమెరికాలో కరోనా పాజిటివ్ తేలిన 2లక్షల 30వేల మంది బాధితుల ఆరోగ్య వివరాలపై పరిశోధక బృందం అధ్యయనం చేసింది. వీరిలో ఎక్కువగా నరాల సంబంధిత సమస్యలు లేదా మానసిక అనారోగ్యం వంటి సమస్యలు 34శాతం ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించారు.

కోవిడ్, ఇతర వైరస్‌లు మెదడుపై ఎలా ప్రభావితం చేస్తాయంటే? :
కరోనా లక్షణాల్లో జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం 25శాతం మంది ఉంటాయి.. వీరిలో మెదడుకు, నాడీ సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. తల తిరగడం, తలనొప్పి, తీవ్ర అలసట, బలహీనపడటం, బ్రెయిన్ ఫాగ్ లేదా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చురుకుతనం కోల్పోవడం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని గుర్తించారు. చాలామందిలో ఈ తరహా లక్షణాలు దీర్ఘకాలికంగా ఉంటాయని తేల్చారు. ఇతర శ్వాసపరమైన సమస్యల కంటే న్యూరోలాజికల్, మానసిక ఆరోగ్యంపై కోవిడ్ తీవ్రంగా ప్రభావం చూపుతుందని గుర్తించారు. కొత్త అధ్యయనంలో 44శాతం ముప్పు కరోనా వచ్చినవారిలో అధికంగా ఉంటుందని తేలింది. అదే ఫ్లూ బాధితుల్లో అయితే 16శాతం ముప్పు ఉంటుందని పరిశోధక బృందం తేల్చింది.

కోవిడ్ బాధితుల్లో మానసిక ఆరోగ్యంపై ప్రభావం :
కరోనా వచ్చిన బాధితుల్లో ఎక్కువగా మానసిక అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని తేలింది. ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. గత అధ్యయనంలో ఇదే గ్రూపువారిపై పరిశోధించగా.. కరోనా వచ్చినవారిలో ఎక్కువగా మానసిక సమస్యలు ఉన్నాయని తేల్చారు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుందని గుర్తించారు. ఫ్లూ బాధితులతో పోలిస్తే.. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో మానసిక రుగ్మతలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధక బృందం తేల్చేసింది. మూడు నెలల వ్యవధిలో కోలుకున్న దాదాపు 20శాతం కరోనా బాధితులు మానసిక రుగ్మతలతోనే బాధపడుతున్నారు.