Neanderthals Footprints : లక్ష ఏళ్ల క్రితం, తీరంలో తుళ్లుతూ నడిచిన నియాండర్తల్ కుర్రాడి పాదముద్రల శిలాజాలు

లక్షల ఏళ్ల క్రితం నాటి నియాండర్తల్ మానవ శిలాజ పాదముద్రలు బయటపడ్డాయి. నియాండర్తల్ మానవులు తమ చిన్నారులతో కలిసి నడిచి వెళ్లిన ఆనాటి పాదముద్రలు చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి.

Neanderthals Footprints : లక్ష ఏళ్ల క్రితం, తీరంలో తుళ్లుతూ నడిచిన నియాండర్తల్ కుర్రాడి పాదముద్రల శిలాజాలు

100,000 Year Old Fossilized Footprints

Neanderthals Fossilized Footprints : లక్షల ఏళ్ల క్రితం నాటి నియాండర్తల్ మానవ శిలాజ పాదముద్రలు బయటపడ్డాయి. నియాండర్తల్ మానవులు తమ చిన్నారులతో కలిసి నడిచి వెళ్లిన ఆనాటి పాదముద్రలు చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి. దక్షిణ స్పెయిన్‌ తీరంలో ఇసుకపై వదిలివేసిన పాదముద్రలను పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఈ శిలాజ పాదముద్రలు లక్షల ఏళ్ల క్రితం నాటివిగా గుర్తించారు. ఈ శిలాజ పాదముద్రలు అప్పటి యువకులకు సంబంధించినవి నివేదికలో వెల్లడించారు. గత జూన్ నెలలో మాటలాస్కానాస్ లోని డొనానా నేషనల్ పార్కు వద్ద బీచ్ లో ఈ పాదముద్రలను ఇద్దరు బయాలజిస్టులు కనుగొన్నారు.

Footpr

భారీ పరిమాణంలో జంతువుల పాదముద్రల మాదరిగా ఉన్న ఈ పురాతన పాదముద్రలను నిశితంగా పరిశోధించారు. నియాండర్తల్ అనే పురాతన మానవ జాతికి చెందిన 87 పాదముద్రలను పరిశోధకులు గుర్తించారు. దీనికి సంబంధించి నివేదికలను మార్చి నెలలో జనరల్ సైంటిఫిక్ రిపోర్టులో ప్రచురించారు. తీరంలోని కొన్ని ప్రాంతాల్లో అస్తవ్యస్తమైన అమరికలో కొన్ని చిన్నపాటి పాదముద్రలను గుర్తించారు. ఈ పాదముద్రలు అప్పటి యువతకు సంబంధించినవిగా తేల్చేశారు.

వీటిని స్కాన్ చేసేందుకు రీసెర్చర్లు ప్రత్యేకమైన టూల్స్ వాడారు. పాదముద్రల సైజు, ఎంత లోతుగా ఉన్నాయో గుర్తించి.. వారి వయస్సు, ఎత్తును అంచనా వేశారు. ఈ మొత్తం గ్రూపు పాదముద్రల్లో 36 మంది ఉండగా.. వారిలో 11 మంది చిన్నారులు, 25మంది పెద్దవారు ఉన్నట్టుగా పరిశోధకులు కనుగొన్నారు. 26 మంది పెద్దవారిలో 5 మంది మహిళలు, 14మంది పురుషులు, మిగిలిన ఆరుగురిలో ఆడ లేదా మగ అనేది గుర్తించలేదు. సగటున ఒక్కొక్కరి ఎత్తు 4 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తు ఉన్నారు. వాస్తవానికి ఈ శిలాజ పాదముద్రలు 106,000 లక్షల ఏళ్ల క్రితం నాటిదిగా గుర్తించారు.

Footprints

ఈ పాదముద్రలు సుమారు 106,000 సంవత్సరాల క్రితం, అప్పర్ ప్లీస్టోసీన్ కాలంలో నియాండర్తల్ ఈ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తేలింది. పెర్ లండన్ నాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఈ పాదముద్రలను భద్రపరిచారు. ప్రారంభ మానవులు 4 లక్షల ఏళ్లు, 40వేల సంవత్సరాల క్రితం మధ్య ఐరోపాలో నివసించేవారు. ఆధునిక మానవులు రెండు జాతులు ఉన్నాయి. కొందరు ఈ ఖండాంతర భూభాగంలో 46వేల నుంచి 44వేల సంవత్సరాల క్రితం వచ్చి కలిసిపోయి ఉండవచ్చు. 2019లో, ఫ్రాన్స్‌లోని లే రోజెల్‌లో పరిశోధకులు సుమారు 80ఏళ్ల సంవత్సరాల క్రితం నాటి 257 నియాండర్తల్ పాదముద్రలను కనుగొన్నారు.