రష్యా వ్యాక్సిన్ కోసం 20దేశాలు ఆసక్తి.. ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తి పూర్తి

  • Published By: sreehari ,Published On : August 18, 2020 / 08:56 PM IST
రష్యా వ్యాక్సిన్ కోసం 20దేశాలు ఆసక్తి.. ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తి పూర్తి

ప్రయోగాలు జరపకుండా వ్యాక్సిన్ సక్సెస్ అని రష్యా ప్రకటించడంపై అన్ని దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయనా ఆ దేశం మాత్రం ఇలాంటివేవీ పట్టించుకోవడం లేదు పైగా ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తి కూడా పూర్తి చేశామని చెబుతోంది. అంతేకాదు తమ వ్యాక్సిన్ కోసం 20 దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, బిలియన్ డోస్‌లకు దరఖాస్తులు కూడా వచ్చాయంటోంది.



తమ వ్యాక్సిన్ తయారీకి భారతీయ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయని రష్యా అధికారిక మీడియా స్పుత్నిక్ పేర్కొంది. మొదటి, రెండో దశ క్లినికల్
ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాల సమాచారాన్ని తమకు ఇవ్వాలని రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ భారత కంపెనీలు కోరినట్టు తెలిపింది. రెగ్యులేటరీ అనుమతుల తరువాత మూడో దేశం ఎగుమతుల కింద వ్యాక్సిన్ల ఉత్పత్తి, ఉపయోగం కోసం భారతీయ కంపెనీలు కోరినట్టు వివరించింది.

ఆర్డీఐఎఫ్‌కు మార్కెటింగ్, ఎగుమతి చేసే అధికారం :
మొదటి కరోనా రిజిస్టర్డ్ టీకా స్పుత్నిక్-5 ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఇప్పటికే రష్యా పూర్తి చేసింది. గమలేయ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి రష్యా రక్షణ సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ 2ను మార్కెటింగ్ చేయడంతోపాటు, ఎగుమతి చేసే అధికారాలు ఆర్డీఐఎఫ్‌కు ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత కంపెనీలు జరుపుతున్న చర్చలు ఫలప్రదమైతే ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉందంటున్నాయి రష్యాలోని భారత రాయబార కార్యాలయ వర్గాలు.



వ్యాక్సిన్ సేఫా కాదా అన్నది తేలాలనే వాదన :
వ్యాక్సిన్‌ కోసం కోటి ఆశలతో ప్రపంచం ఎదురుచూస్తున్నవేళ రష్యా తొలి వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న ప్రకటించింది.అప్పటినుంచే వ్యాక్సిన్‌ సామర్థ్యంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముందు సురిక్షితమైందా.. ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ పరీక్షల శాంపిల్‌ పరిమాణం.. దాని కెపాసిటీ లాంటి ప్రాతిపదికన భద్రతను పసిగట్టొచ్చని అంటున్నారు.

ముందు వ్యాక్సిన్‌ సేఫ్ అండ్ సెక్యూరా కాదా అన్నది తేలాలంటున్నారు. ఇన్ని డిమాండ్ల మధ్య కూడా రష్యా గుడ్డిగా ముందుకెళ్తుంది. ప్రయోగాలు పూర్తి కాకుండానే కోట్ల డోసుల ఉత్పత్తిని స్పీడప్ చేసింది. ఇది మంచి పరిణామం కాదంటున్నారు వైద్య నిపుణులు.



ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో జంతువులపై ప్రయోగాలు :
మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకుండా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడమే పెద్ద వండర్ గా కనిపిస్తోంది. అసలు రష్యా ఆ టీకాపై ఎందుకంత ధీమా పెట్టుకుందన్నది అంతుపట్టడం లేదు. నిజానికి ప్రీ క్లినికల్ ట్రయల్స్‌ లో పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగిస్తారు. ఆ తర్వాత ఫేజ్‌ 1లో అతి కొద్ది మందిపైనే వ్యాక్సిన్‌ను పరీక్షిస్తారు. అది సురక్షితమా కాదా అన్న దాంతో పాటు రోగ నిరోధక వ్యవస్థను పరిశీలిస్తారు. ఫేజ్ 2లో వేర్వేరు ప్రాంతాల్లో వందల మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తారు. పిల్లలు, వృద్ధులపై ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుంటారు.



ఏ తరహా జన్యు సమూహాలపై దుష్ప్రభావాలు? :
ఫేజ్‌ 3లో వేలాది మందికి వ్యాక్సిన్‌ను ఇస్తారు. ఏ తరహా జన్యు సమూహాలపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతోంది? వ్యాక్సిన్‌ సామర్థ్యం లాంటి అంశాలను పరిశీలిస్తారు. అయితే కొన్నిసార్లు ఔషధ నియంత్రణ సంస్థలు మరింత భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని కూడా కోరతాయి. కానీ.. కరోనా లాంటి మహమ్మారి విలయం సృష్టిస్తున్న క్రమంలో ఔషధ నియంత్రణ సంస్థలు ట్రయల్స్‌ను వేగంగా చేయడానికి అనుమతిచ్చాయి. అయితే ఎంతకాదన్నా ఏడాదిన్నరస సమయం మినిమమ్ పడుతుంది. కానీ ఈలోగానే రష్యా వ్యాక్సిన్ ప్రకటించడం.. ఉత్పత్తి కూడా ప్రారంభించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.