Pfizer vaccine : ఆ ముగ్గురు చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు..

లూసియానాలో ముగ్గురు చిన్నారులకు ఫైజర్ కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు అందింది. ప్రముఖ పార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ ఆరు నెలల నుంచి 11ఏళ్ల మధ్య చిన్నారుల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.

Pfizer vaccine : ఆ ముగ్గురు చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు..

3 Siblings, Ages 1, 3 And 6, Get Pfizer Vaccine In Clinical Trial

Pfizer vaccine in clinical trial : లూసియానాలో ముగ్గురు చిన్నారులకు ఫైజర్ కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు అందింది. ప్రముఖ పార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ ఆరు నెలల నుంచి 11ఏళ్ల మధ్య చిన్నారుల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ లో భాగంగా లూసియానాకు చెందిన ఎల్లియి బయై (6) , క్రిస్టియన్ బయై (3), సొలాన్ బుయై (14) నెలల చిన్నారులకు ఫైజర్ మొదటి డోసు వేసింది.

లూసియానాలోని జెఫర్‌సన్ లోని Ochsner ఆస్పత్రిలో రెండు డోసుల్లో ముందుగా తొలి డోసు ఈ ముగ్గురు చిన్నారులు అందుకున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. తమ ముగ్గురు పిల్లలకు ఫైజర్ మొదటి డోసు ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

బుయై తోబట్టువులకు ప్లేసిబో ఫైజర్, జర్మనీ భాగస్వామి బయోటెక్‌తో కలిసి సంయుక్తంగా పిల్లల్లో వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితమో అనేదానిపై పరిశోధన చేశారు. గత డిసెంబర్ నెలలోనే ఫైజర్ వ్యాక్సిన్ 16ఏళ్లు ఆపైబడిన వారిలో అత్యవసర వినియోగానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది.

ఆ తర్వాత మే నెలలో 12ఏళ్లలోపు పిల్లలకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ విస్తరించినట్టు తెలిపింది. ఈ ట్రయల్స్ లో భాగంగా 6 నెలల లోపు చిన్నారుల్లో మూడు భాగాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే 4,500 మంది వాలంటీర్లు పాల్గొనగా.. అమెరికాలోని ఫిన్ లాండ్, పోలాండ్, స్పెయిన్ సహా 90కిపైగా క్లినికల్ సైట్లలో వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించారు.