ప్రేమ గురించి సైన్స్: ఈ లక్షణాలుంటే మీరు ప్రేమలో ఉన్నట్లే..

ప్రేమ గురించి సైన్స్: ఈ లక్షణాలుంటే మీరు ప్రేమలో ఉన్నట్లే..

లవ్ ఎట్ ఫస్ట్ సైట్(తొలిచూపులోనే ప్రేమలో పడటం) నమ్ముతారా.. నెలల తరబడి ఉన్న స్నేహంలో ప్రేమ దాగుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ప్రపంచంలో అందరికంటే ఏ ఒక్క మనిషే ప్రత్యేకంగా అనిపిస్తున్నారా.. ప్రేమలో పడ్డానా అనే అనుమానంతో ఉన్నారా.. అయితే ఇవి తెలుసుకోండి. మీరు ఇప్పటికే ప్రేమలో ఉంటే మీలో ఈ లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. 

1. మెసేజ్ వచ్చిన క్షణాల్లోనే రిప్లై ఇచ్చేస్తున్నారా…
2. వారు చేసే పనులు ఈజీగా అయిపోవాలని తెరవెనుక మీరే కష్టపడుతున్నారా..
3. ఎక్కడికి వెళ్లినా.. ఆ వ్యక్తే మీకు గుర్తు వస్తున్నారా..
4. తన జన్మ నక్షత్రం గురించి పట్టించుకోకూడదని అనుకుంటున్నారా..
5. మాజీ ప్రేయసి లేదా ప్రియుడు మళ్లీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నా.. నెగ్లెక్ట్ చేస్తున్నారా..
6. మీకు అయిన గాయం గురించి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారా..
7. కొత్త పని చేయడానికి వెనుకాడకుండా మొదలుపెట్టగలుగుతున్నారా..
8. సరదా పనులు చేయడం కోసం.. తేదీలు, సమయం చూసుకోవడం లేదా..
9. తనతో కలిసి ఎలా బతకాలనుకుంటున్నారో.. తన కోసం ఏం చేయగలరో ఊహించుకుంటున్నారా..
10. ఏ ఒక్కరోజు మిస్ అయినా బరువుగా.. బాధగా ఫీల్ అవుతున్నారా..
11. గతంలో జరిగిన బ్రేక్ అప్ మచ్చుకైనా గుర్తు లేకుండా పోయిందా..
12. చీదరించుకునే పనులు కూడా ఇష్టపడుతున్నారా.. 
13. వారి కోసం చిన్న చిన్న త్యాగాలు చేయడం కూడా మంచిగానే అనిపిస్తుందా..
14. ప్రపంచమంతా నెగెటివ్ గా కనిపించి వారొక్కరే పాజిటివ్ అనిపిస్తున్నారా..
15. వారితో పాటుగా ఉంటే సేఫ్ గా ఫీలవుతున్నారా.. 
16. వారి సంతోషం కోసం మీరు ఎంతవరకూ తగ్గడానికైనా వెనుకాడడం లేదా..
17. చేసే ప్రతిపనిలో నడిచే దారిలో పేరు వినిపించిన ప్రతీసారి ఆ వ్యక్తే గుర్తొస్తున్నారా..
18. చెడు జరిగినా.. మంచి జరిగినా.. ముందుగా ఆ వ్యక్తితోనే మీరు పంచుకోవడానికి ఇష్టపడుతున్నారా..
19. వారికి చెప్పడానికి గానీ, వారి ముందు ఏడవడానికి గానీ భయపడటం లేదా..
20. కలిసి కిరాణా షాపుకు వెళ్లినా.. స్పెషల్ టూర్ కింద భావిస్తున్నారా..
21. మీ ముందు ఎంత చెడుగా మాట్లాడినా.. వారితోనే ఉండాలనుకుంటున్నారా..
22. వాళ్లు ఫోన్ చేసినప్పుడు గట్టిగా అరవకుండా… ఫోన్ తోనే అన్యోన్యంగా గడిపేస్తున్నారా..
23. వాళ్ల బాధను మీదిగా భావించి గంటల కొద్దీ ఆలోచిస్తూ ఉండిపోతున్నారా..
24. వారి చిన్ననాటి ఫొటోలను చూసి మీరు ఎంటర్‌టైన్ ఫీలవుతున్నారా..
25. వారితో పాటు ఉండీ ఏ పని చేయకపోయినా.. హ్యాపీగానే ఉందా..
26. మీ ఇష్టాలను వారితో పంచుకోవాలని, నచ్చినవి వాళ్లకు తెలియాలనుకుంటున్నారా..
27. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వారి గురించి చెప్పడంలో అలసిపోయినట్లు కూడా అనిపించడం లేదా..
28. మీ కుటుంబానికి పరిచయం చేయడం కోసం తంటాలు పడుతున్నారా..
29. వారి సోషల్ మీడియా అకౌంట్లలోకి తరచుగా తొంగి చూస్తున్నారా..
30. ఆ వ్యక్తితో పాటు కలిసి ఉండాలని చేసిన పనినే మళ్లీమళ్లీ చేస్తున్నారా.. 

ఈ లక్షణాల్లో మీలో ఏ మాత్రం ఉన్నాయో.. చూసుకున్నాక ఇంకెందుకు ఆలస్యం మీ ప్రేమను ఆ వ్యక్తితో పంచుకోండి.