ఇంటర్వ్యూకి వచ్చేవాళ్లల్లో ఏం చూడాలి.. కీలకమైన 4పాయింట్లు

ఇంటర్వ్యూకి వచ్చేవాళ్లల్లో ఏం చూడాలి.. కీలకమైన 4పాయింట్లు

బిజినెస్‌పరంగా కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం తప్పనిసరి. వారి ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నామని.. కల్చర్ కు సరిపోతామని నిరూపించుకోలేకపోతే పక్కకుపెట్టకపోతే కంపెనీ ఎదుగుదల ఆపేసినట్లే. బిజినెస్ అండ్ ప్రోఫిట్ కోసం ఎంత ఎబిలిటీతో ఉన్నారో తెలుసుకోవాలి.

1. గెలుపు అనేది ఎన్నో దారుల్లో జరగొచ్చు:
గెలవాలనే సంకల్పం మీకుందా. అదెలా వస్తుందో తెలీకపోయినా గెలవాలనే తపన మీకుంటే చాలు. అది మైండ్ లో ఉంచుకుని అటువంటి అభ్యర్థులనే ఎంపిక చేసుకోవాలి. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వేరే రూట్ ఎంచుకుని బయటపడేటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి.

2. నేర్చుకోవడం ఓ అలవాటు కావాలి:
ఇండస్ట్రీ గురించి, నాలెడ్జ్ పెంచుకోవడానికి రెడీగా ఉండి ఎప్పుడూ నేర్చుకోవాలనే కుతూహలం ఉండే వ్యక్తులను ఎంచుకోవాలి. కొత్త స్కిల్స్, టెక్నిక్స్, పద్ధతులు తెలుసుకునేందుకు రెడీగా ఉండే వ్యక్తులను ఎంచుకుంటే గేమ్‌లో టాప్ అవ్వొచ్చు.

3. పర్ఫెక్షన్‌తో పాటు డిఫరెంట్‌గా కనిపించడం:
ప్రతిక్షణం పర్ఫెక్ట్ ఫలితాలు రావాలని మాత్రమే కోరుకోకూడదు. పర్ఫెక్షన్ అనేది లక్ష్యంగా పోరాడటంతో పాటు దానిని కరెక్ట్ గా మేనేజ్ చేయడం తెలియాలి. విషయంపై పూర్తి విశ్లేషణ చేయగలిగి సాధించడానికి వేరే కోణంలోనూ ప్రయత్నించేలా ఉండాలి. పర్ఫెక్ట్‌నెస్ తో పాటు డిఫరెంట్ గా ఆలోచించేలా ఉండడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట.

4. టీం ప్లేయర్‌లా ఉండడమూ ముఖ్యమే:
ఏ ఆర్గనైజేషన్ అయినా వన్ మాన్ షో మాత్రం కానే కాదు. ఎవరినైనా ఎంపిక చేసుకునేముందు టీంలో సరిపోతాడా.. ఓ జట్టు వ్యక్తిలా ఉండగలడా అనేది చూసుకోవాలి. దాంతో పాటు ఉద్యోగానికి సరిపడ వ్యక్తి లేదా అని పరీక్షించాలి. ఇతరులతో కలిసి పనిచేయలేమన్నప్పుడే హద్దులు పెట్టుకోవడం మొదలవుతాయి.