5 Critical COVID Signs : ఈ 5 క్రిటికల్ కోవిడ్ లక్షణాలు ఉంటే.. ఆస్పత్రిలో తప్పక చేరాల్సిందే..!

దేశంలో కరోనా విజృంభిస్తోంది. నాల్గో వేవ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 16,2021 నాటికి 2 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కరోనా వేరియంట్లు, మ్యుటేట్ వైరస్ స్ట్రయిన్లు అత్యంత మహమ్మారి వైరస్‌లుగా రూపుదాల్చాయి.

5 Critical COVID Signs : ఈ 5 క్రిటికల్ కోవిడ్ లక్షణాలు ఉంటే.. ఆస్పత్రిలో తప్పక చేరాల్సిందే..!

5 Critical Covid Signs And Symptoms That Demand Hospitalization (1)

5 critical COVID signs : దేశంలో కరోనా విజృంభిస్తోంది. నాల్గో వేవ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 16,2021 నాటికి 2 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కరోనా వేరియంట్లు, మ్యుటేట్ వైరస్ స్ట్రయిన్లు అత్యంత మహమ్మారి వైరస్‌లుగా రూపుదాల్చాయి. రోజురోజుకీ ఈ వైరస్ లోడ్ సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. కోవిడ్ స్ట్రయిన్లు కేవలం అత్యంత ప్రాణాంతక వ్యాధులు మాత్రమే కాదు.. తీవ్రమైన కరోనా లక్షణాలు ఉంటాయి. యువత, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా అందరిలోనూ ఈ స్ట్రయిన్ జాతి వైరస్ లు ప్రాణాలు బలిగొంటున్నాయి. ఆస్పత్రిలో చేరాల్సినంతగా వ్యాధి సంబంధిత లక్షణాలు ఉంటున్నాయి.

Breath



ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకినవారిని హోం క్వారంటైన్ లోనే ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. అవసరమైతే తప్పా ఆస్పత్రిలో చేరాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనాలో ఏయే లక్షణాలు ప్రాణాంతకమైనవి? ఏ లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలనేది కూడా గుర్తించడం కష్టంగా మారింది. SARS-COV2 లక్షణాలు స్వల్పం నుంచి తీవ్రంగా మారే అవకాశం ఉంది. వైరస్ సోకిన మొదటి వారం ఎంతో కీలకం. ఈ సమయంలో కనిపించే లక్షణాలపై అవగాహన తప్పక ఉండాలి. లక్షణాల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? తీవ్ర లక్షణాలుగా మారాయా? లేదా అనేది మానిటర్ చేస్తుండాలి. ఆస్పత్రిలో చేరేంత తీవ్రమైన లక్షణాలు ఉన్నాయో లేదో గుర్తించాలి.

Chest Pain

కరోనా తీవ్ర లక్షణాల్లో శ్వాస తీసుకోలేకపోవడం, ఛాతిలో నొప్పి వంటి తీవ్రమైన లక్షణాలుగా చెప్పవచ్చు. శరీరంలోని ఆరోగ్యకరమైన శ్వాసకోశ పైనాళాలపై కరోనావైరస్ దాడి చేస్తుంది. దాంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా నడుస్తున్న సమయంలో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే అది కరోనా లక్షణం కూడా కావొచ్చు. కళ్లు మూసుకుని శ్వాస తీసుకోవడం లేదా శ్వాస వదలడం చేయాలి. మీరు ఆ సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటే వెంటనే ఆస్పత్రిలో వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఉందంటున్నారు.



Oximeter

ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. అది ప్రాణాంతకమే.. కరోనా సోకినవారిలో ఈ తరహా ఆక్సిజన్ స్థాయిలు పడిపోవచ్చు. కరోనా న్యూమోనియాకు దారితీస్తుంది. ఊపిరితిత్తుల్లో మంటగా అనిపిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. ఆస్పత్రిలో చేరిన బాధితుల అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. పేషెంట్ కు తెలియకుండానే ఆక్సిజన్ స్థాయిలు ఆకస్మాత్తుగా పడిపోతాయి. హోం క్వారంటైన్ లో ఉండేవారంతా ఆక్సీమీటర్ ద్వారా ఎప్పటికప్పుడూ ఆక్సిజన్ స్థాయిలు చెక్ చేసుకుంటుండాలి. ఆక్సిన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. వైద్యసాయం తప్పక తీసుకోవాల్సిన అవసరం పడుతుంది.



Covid Tem

మతిమరుపు లేదా కన్ఫూజన్ అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే.. కరోనా సోకిన వారిలో మెదడు, నాడీసంబంధిత వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దాంతో గందరగోళంగా అనిపిస్తుంటుంది. నిద్రమత్తుగా ఉంటుంది. తద్వారా మతిమరుపు లేదా మర్చిపోవడం వంటి లక్షణాలు తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు సరిగా మాట్లాడలేరు.. పరిస్థితి విషమిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాల్సి ఉంటుంది.

Covid Symptoms

ఛాతిలో ఎలాంటి తేలికపాటి నొప్పి వచ్చినా నిర్లక్ష్యంగా ఉండరాదు. చాలావరకూ కేసుల్లో కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోని మ్యుకోసల్ భాగాలపై ఎక్కువగా దాడిచేస్తుంటుంది. దాంతో ఛాతిలో నొక్కేసినట్టు నొప్పి వస్తుంటుంది. అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో వెంటనే వైద్యచికిత్స తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.



Lips

పెదాలు, ముఖంలోని పలు భాగాలు నీలం రంగులోకి మారిపోతాయి. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో హైపోక్సియాకు దారితీస్తుంది. సరైన సమయంలో వైద్యసాయం అందకపోతే మరణం సంభవించవచ్చు. ఇలాంటి లక్షణం ఉంటే వెంటనే సకాలంలో వైద్యసాయం అందించాలి.

కరోనా వైరస్ సోకినవారిలో చాలావరకూ వేర్వేరు లక్షణాలు కనిపిస్తుంటాయి. మరికొంతమందిలో ఒకేరకమైన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలామందిలో ఎక్కువగా కనిపించే సాధారణ వైరస్ లక్షణాల్లో జ్వరం, గొంతునొప్పి, ముక్కు కారడం, ముక్కు దిబ్బెడ, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.



Fever

కరోనా వచ్చిన బాధితుల్లో ఎక్కువగా కనిపించే లక్షణాల్లో జ్వరం, డయేరియా, తీవ్ర అలసట, అవయవాల్లో ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఏ ఒక్కటి కనిపించినా వెంటనే అత్యవసర చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.