Lose Weight : బరువును సులభంగా తగ్గించే 5 రకాల పానీయాలు!
భారతీయ గృహాలలో పసుపు ఇతర మసాలా దినుసుల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది. బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఔషధ విలువల విషయానికి వస్తే పసుపు ఆల్ రౌండర్ గా చెప్పవచ్చు.

Lose Weight : బరువు తగ్గడానికి చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంట్లో లభించే పదార్ధాలతోనే సులభంగా, బరువు తగ్గొచ్చన్న విషయం అవగాహన ఉండదు. సరైన బరును నిర్వహించుకునేందుకు వంటి గంటగదిలో లభించే కొన్ని పదార్ధాలు ఎంతో దోహదం చేస్తాయి. వీటితో చక్కని పానీయాలను తయారు చేసుకుని సేవిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. బరువును తగ్గించటంలో వంటగదిలో లభించే వస్తువుల ఏవిధంగా ఉపకరిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
బరువును తగ్గించే పానీయాలు ;
1. జీరా వాటర్ ; రోజుకు ఒక కప్పు జీరా నీరు అదనపు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగించటంలో సహాయపడుతుంది.
ఎలా తయారుచేయాలి: ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర (ముడి జీలకర్ర)ని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. నీటిని వడకట్టి, నానబెట్టిన జీరాను వేయండి. జీరా నీటిని తక్కువ మంట మీద కొన్ని నిమిషాలు ఉడకబెట్టండి. మీకు కావాలంటే చిటికెడు నల్ల ఉప్పు వేసుకోవచ్చు. అలా తయారు చేసిన పానీయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి.
2. వాము వాటర్ ; వాసన కలిగిన వాము విత్తనాలు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. జీలకర్ర వలె, వాము కూడా జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది బరువు నిర్వహణకు కీలకమైన జీవక్రియకు కూడా సహాయపడుతుంది.
ఎలా తయారుచేయాలి: వాము గింజల ప్రయోజనాలను పొందడానికి, దానిని నీటితో ఉడకబెట్టాలి లేదంటే జీరా లాగా రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఒక గ్లాసు తయారు చేసుకుని ఆ పానీయానికి నిమ్మరసం, నల్ల ఉప్పు కలపుకోవాలి. అనంతరం వాటిని సేవించాలి. ఇలా చేస్తే బరువు సులభంగా తగ్గవచ్చు.
3. భారతీయ గృహాలలో పసుపు ఇతర మసాలా దినుసుల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది. బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఔషధ విలువల విషయానికి వస్తే పసుపు ఆల్ రౌండర్ గా చెప్పవచ్చు.
ఎలా తయారు చేయాలి: ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని తీసుకోండి. దానిలో చిటికెడు పసుపు వేయాలి. ఒక కప్పు వరకు నీరు వచ్చేలా బాగా మరిగించాలి. మరిగే సమయంలో దాల్చినచెక్కను నీటిలో వేయవచ్చు. నీటిని చల్లబడిన తరువాత ఆనీటిని తాగాలి. ఇలా చేస్తే బరువు సులభంగా తగ్గవచ్చు.
4. అల్లం, నిమ్మ నీరు ; అల్లం, లెమన్ వాటర్ బరువు తగ్గడానికే కాదు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం, అజీర్ణం, జీర్ణవ్యవస్థలో తరచుగా సంభవించే సమస్యల ఉపశమనం కలిగిస్తుంది.
ఎలా తయారు చేయాలి: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. అందులో అల్లం ముక్కను వేయండి. లేకుంటే అల్లం రసాన్ని కూడా జోడించవచ్చు. మంచి రుచి కోసం దాల్చిన చెక్కను వేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ వాటర్ ను తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చు.
5.నిమ్మ, తేనె నీరు ; నిమ్మకాయ తేనె నీరు జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. గట్ కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తేనె తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని కూడా చెబుతారు
ఎలా తయారు చేయాలి: ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో నాల్గవ వంతు నిమ్మకాయను పిండి, దానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఉదయాన్నే తాగాలి. ఇలా ప్రతిరోజు తాగటం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు.
1Chandrababu Warning : వచ్చేది నేనే.. తప్పుడు అధికారులను వదలను- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
2Telangana: తెలంగాణకు వచ్చి, రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి: మోదీకి కేటీఆర్ లేఖ
3Prophet row: దేశంలో నెలకొన్న పరిస్థితులకు కారణం నుపూర్ శర్మ కాదు: రాహుల్
4Srivari Salakatla Brahmotsavam: సెప్టెంబర్ 27 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక దర్శనాలు రద్దు
5Dasara: దసరా.. ఫిర్ షురూ!
6Banned on WhatsApp : మీ వాట్సాప్ బ్యాన్ అయిందా? అకౌంట్ అప్పీల్ ఇలా చేసుకోవచ్చు!
7Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ
8BJP Executive Meeting : హైదరాబాద్‌లో కాషాయ సంబురం.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం
9Raashi Khanna: అందాల రాశి.. మతిపోగొడుతోంది అందాలు ఆరబోసి!
10Instagram Account : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు!
-
Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం
-
Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
-
Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!
-
TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
-
Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!
-
Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!