కరోనా నుంచి రక్షంచుకోవటానికి , ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి ఈ విటమిన్స్ తీసుకుంటే చాలు..

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 11:19 AM IST
కరోనా నుంచి రక్షంచుకోవటానికి , ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి ఈ విటమిన్స్ తీసుకుంటే చాలు..

కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ ధరిచేరకుండా ఉండటానికి నానా పాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. ఈ సమయంలో మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ ని పెంపొందించుకోవాలి. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్నిపెంపొందించుకోవటం కోసం కొన్ని రకాల విటమిన్లు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆ విటమిన్స్ ఏవి, ఏయే ఆహార పదార్ధాల్లో ఉంటాయో తెలుసుకుందాం..

విటమిన్ A :

విటమిన్ A చర్మ కణాల పనితీరులో ఉపయోగపడుతుంది. ఇది మన శరీరం లో వ్యాధిని సంక్రమణకు కారణమయ్యే కారకాలను ఎదుర్కోటానికి విటమిన్ ఎ అవసరం. కణాల పెరుగుదలకు, కంటిచూపుకు మెరుగుపరచటంలో విటమిన్ ఎ ఉపయోగపడుతుంది.

చేపలు, గుడ్డు సోన, జున్ను, టోపు, విత్తనాలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్ళు, క్యారెట్, ఆకుకూరలలో ఎక్కువగా  విటమిన్ ఎ ఎక్కువగా  లభిస్తుంది.

మొక్కలలో ఇది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది కాలేయం, పేగులలో విటమిన్ A గా మారుతుంది. బీటా కెరోటిన్ మాత్రం ఆకుకూరలు, నారింజ, కూరగాయల్లో , క్యారెట్లలో లభిస్తుంది.

విటమిన్ B:

విటమిన్ Bలో ముఖ్యంగా విటమిన్ బి6, బి12 మన శరీరంలో నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, జీవక్రియలు సరిగా జరగడానికి ఎంతో అవసరం. ఇవి కళ్లు, జుట్టు, కాలేయం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బి12 లోపిస్తే కంట్లో నరాలు దెబ్బతింటాయి. ఈ రెండు విటమిన్లు మాంసంలో అధికంగా లభిస్తాయి. 

తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పచ్చి ఆకుకూరలు, పండ్లు, చేపలు, మాంసం వంటి పదార్ధాల్లో విటమిన్ బి6 లభిస్తుంది. విటమిన్ బి9 మాత్రం ఆకుకూరలు, చిక్కుళ్ళు వంటి వాటిలో ఫోలేట్ ఆక్సిడ్ పుష్కలంగా లభిస్తుంది.

విటమిన్ బి12 ని రసాయనా నామం సైనోకోబాలమిన్ అంటారు. ఇది ఎక్కువగా గుడ్లు, మాంసం, సోయా పాలలో కనిపిస్తుంది.

విటమిన్ C,విటమిన్ E :
 
విటమిన్ సి నీటిలో కరిగే ఒక విటమిన్. ఇది శరీరం యొక్క కనెక్టివ్ కణజాలల ఆరోగ్యాన్ని సంరక్షించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా.
అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ ఇ కణాలను  మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించటానికి సహాయపడతాయి.

విటమిన్ సి ఎక్కువగా నారింజ, నిమ్మకాయలు, బెర్రీలు, కివి ప్రూట్, బ్రోకొలీ, టమోటాలు, క్యాప్సికమ్ లలో ఎక్కువగా లభిస్తాయి. విటమిన్ ఇ పచ్చి ఆకు కూరలు, గింజలు, కూరగాయల నూనెలలో లభిస్తాయి.

విటమిన్ D :

మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ ని తగ్గించే కారకాలను నాశనం చేయటానికి విటమిన్ డి అవసరం అవుతుంది. ఇది ఎక్కువగా సూర్యరశ్మి నుంచి శరీరానికి లభిస్తుంది. అంతేకాకుండా గుడ్లు, పాలు, చేపలు వంటి వాటిలో కూడా విటమిన్ ఇ లభిస్తుంది.  చాలా మంది ఆరుబయట సూర్యనికి ఎదురుగా కొన్ని నిమిషాలు పాటు నిలబడి విటమిన్ డి ని పొందుతారు.

జింక్, ఐరన్, సెలీనియం :

శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవటానికి జింక్, ఐరన్ కూడా చాలా అవసరం. ఐరన్ రోగనిరోధక క్రిములను నాశనం చేయటంలో సహాయపడుతుంది. రోగనిరోధక క్రిములను గుర్తించటంతో పాటు అవసరమైన ఎంజైమ్స్ ను అందించటంలో సహాయపడుతుంది.
మన శరీంలో జింక్, సెలీనియం యాంటీఆక్సిడెంట్స్ గా పని చేస్తాయి. అంతేకాకుండా ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గిస్తుంది.

మాంసం, కోడి, చేపలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. జింక్  మాత్రం ఎండిన బీన్స్, కాయకూరలలో లభిస్తుంది. 

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మనం ఆరోగ్యంగా ఉండటం మంచిది. విటమిన్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాయామం చేయటం, సరైన నిద్ర పోవటం , సామాజిక దూరాన్ని పాటించటం, ప్రతి రోజు చేతులను సబ్బుతో కడుక్కోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.