బార్బీ ఈజ్ బెస్ట్ : 60 ఏళ్ల అందాల బొమ్మ

ఆమెకు అరవై ఏళ్లు నిండాయి. అయినా ముఖంపై ఒక్క ముడత కనిపించదు. అంతాపురంలోని రాకుమారి నుంచి పేదింటి పడుచమ్మాయి దాక అందరూ ఆమెకు అభిమానులే. అందం ఆమె సొంతం, అభిమానం ఆమెకు వరం. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..?

  • Edited By: veegamteam , January 12, 2019 / 09:57 AM IST
బార్బీ ఈజ్ బెస్ట్ : 60 ఏళ్ల అందాల బొమ్మ

ఆమెకు అరవై ఏళ్లు నిండాయి. అయినా ముఖంపై ఒక్క ముడత కనిపించదు. అంతాపురంలోని రాకుమారి నుంచి పేదింటి పడుచమ్మాయి దాక అందరూ ఆమెకు అభిమానులే. అందం ఆమె సొంతం, అభిమానం ఆమెకు వరం. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..?

ఆమెకు అరవై ఏళ్లు నిండాయి. అయినా ముఖంపై ఒక్క ముడత కనిపించదు. అంతపురంలోని రాకుమారి నుంచి పేదింటి పడుచమ్మాయి దాక అందరూ ఆమెకు అభిమానులే. అందం ఆమె సొంతం, అభిమానం ఆమెకు వరం. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..? అమ్మాయిలకు ఇష్టమైన హీరో ఎవరు? నచ్చిన వ్యక్తి ఎవరు? అని అడిగితే ఒక్కోక్కరు ఒక్కో పేరు చెబుతారు. కానీ ఇష్టమైన బొమ్మ అని అడిగితే? దాదాపు ప్రతిఒక్కరి నోటి నుంచి వచ్చే పేరు.. బార్బీడాల్‌!  అంతలా అమ్మాయిల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ అందాల బొమ్మ. 1959లో న్యూయార్క్‌లోని అమెరికన్‌ టాయ్‌ ఫెయిర్‌లో తొలిసారి దర్శనమిచ్చిన బార్బీ.. ఈ ఏడాది మార్చి 9న 60వ పుట్టిన రోజును జరుపుకోబోతోంది. 

మార్కెట్లోకి వచ్చిన మొదటిసారే మూడు లక్షల బొమ్మలు అమ్ముడుపోయాయంటే చూడండి.. బార్బీకున్న కొత్తదనం. బార్బీ బొమ్మ కొత్తది తయారు కావాలంటే 13 నుంచి 18 నెలలు పడుతుంది. అమెరికా లాస్ ఏంజిల్స్ లోని సీగండో డిజైన్ స్టూడియోలో వంద మందికి పైగా డిజైనర్లు కొత్త డిజైన్ల కోసం కష్టపడుతూనే ఉంటారు. బార్బీ ముఖానికి సొగసైన రూపాన్ని ఇవ్వడానికి త్రీడీ ప్రింటింగ్ సాఫ్ట్‌ వేర్ ను వాడుతారు. ఇవన్నీ రెడీ ఐన తర్వాత డిజైనింగ్ నిపుణుల బృందం దానికి అందమైన రూపాన్ని ఇస్తారు. సిద్ధమైన బొమ్మ రూపాన్ని కావలసిన సైజుల్లో తయారుచేసేందుకు ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఫ్యాక్టరీలో బొమ్మ తయారుకాగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డీలర్లకు పంపిస్తారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకొని, కొత్త కొత్త డిజైన్లతో తక్కువ సమయంలోనే మార్కెట్లలో విడుదలవుతుందీ బార్బీ డాల్. ఒక అందమైన బార్బీ డాల్ తయారు కావడం వెనుక ఇంత తతంగముంది.

బార్బీ బొమ్మలాగే ఇతర కంపెనీలు ఎన్నో రకాల బొమ్మలను మార్కెట్లోకి విడుదల చేశాయి, కానీ విజయవంతం కాలేకపోయాయి, కొన్ని పోటీలో ఉన్నప్పటికీ బార్బీడాల్ కు ఆదరణ తగ్గలేదు. ఇప్పటివరకు 58 మిలియన్ల బార్బీ బొమ్మలు అమ్ముడుపోయాయంటే చూడండి బార్బీ డాల్ ఫాలోయింగ్. పిల్లల పుట్టినరోజులకు, శుభకార్యాలకు ఈ బొమ్మలనే బహుమతులుగా ఇస్తుంటారు పెద్దవారు. అంతేకాదు చిన్న పిల్లలు ఏడుస్తున్నపుడు వారిని ఊరడించడానికి ఈ బొమ్మలతోనే ఆటలాడిస్తారు తల్లులు. ఇదీ బార్బీ డాల్ కథ.