రూ.100 కట్టినా చాలు : భారీ చలాన్లు తగ్గించుకోవచ్చు.. FBలో పోలీస్ వాలా పాఠాలు!

  • Published By: sreehari ,Published On : September 23, 2019 / 12:08 PM IST
రూ.100 కట్టినా చాలు : భారీ చలాన్లు తగ్గించుకోవచ్చు.. FBలో పోలీస్ వాలా పాఠాలు!

కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చాలు.. భారీగా ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారు. ఆ చలాన్లు చూసి వాహనదారులు బెదిరిపోతున్నారు. బండి బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. ఏ చిన్న డాక్యుమెంట్ లేకున్నా.. ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు వేస్తుండంపై వాహనదారులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహన సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ చలాన్లు 10 రెట్లు పెరిగాయి. సాధారణంగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే విధించే చలాన్లు రూ.500 నుంచి రూ.5వేల వరకు పెంచడంతో వాహనదారుల జేబులు ఖాళీ అవుతున్నాయి. 

కొత్త వాహన చట్టాన్ని వ్యతిరేకస్తూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి వాహన చట్టం 2019లోని రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కారణంగా ట్రాఫిక్ పోలీసులు అడిగినంత జరిమానా కట్టేసి లబోదిబోమంటున్నారు. కొత్త చట్టం ప్రకారం.. భారీగా చలాన్లు పెరిగినట్టే.. పరిస్థితులబట్టి కట్టే చలాన్లు తగ్గించుకునే వెసులుబాటు కూడా ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. భారీ చలాన్లను ఎలా తగ్గించుకోవాలనేదానిపై సునీల్ శాండూ అనే పోలీసు వాలా తన ఫేస్ బుక్ లో వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. ఈ వీడియోలో మోటార్ వెహికల్స్ యాక్ట్ 2019 కింద జారీ చేసిన రూ.2వేల ట్రాఫిక్ చలాన్ పై తప్పని పరిస్థితుల్లో కేవలం రూ.వంద కట్టినా సరిపోతుంది అని అంటున్నారు. 

కొత్త ట్రాఫిక్ చలాన్ జాబితా ప్రకారం.. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుంటే సదరు వ్యక్తికి రూ.5వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకవేళ PUC పొల్యుషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.10వేల వరకు జరిమానా పడుతుంది. ఒకవేళ బండి ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు లేకుంటే రూ.2వేలు ఫైన్ విధిస్తారు. వాహన దారుడికి ఉండాల్సిన అన్ని డాక్యుమెంట్లు ఉండి.. వెహికల్ వెంట తీసుకురావడం మరిచిపోయిన సందర్భాల్లో వేసిన ట్రాఫిక్ చలాన్లను రూ.100 వరకు తగ్గించుకోవచ్చునని సునీల్ చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వాహనాదారుడు 15 రోజుల్లోగా జరిమానా చెల్లించవచ్చు. అలోగా డాక్యుమెంట్లు రెడీ చేసుకుని చూపిస్తే సరిపోతుంది.. తక్కువ జరిమానాతో బయపడొచ్చు. 

ఆ రెండెంటికి.. ఈ నిబంధన వర్తించదు : 
15 రోజుల సమయంలో సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లి సరైన డాక్యమెంట్లను చూపిస్తే చాలు.. కేవలం రూ.వంద జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. చలాన్ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదుంటున్నారు. 15 రోజులు దాటితే మొత్తం చలాన్ చెల్లించాల్సిందే అంటున్నారు. అయితే హెల్మట్ లేకుండా డ్రైవ్ చేయడం.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన సమయాల్లో మాత్రం ఈ నిబంధన వర్తించదు అని సునీల్ స్పష్టం చేశారు. వారం క్రితం వైరల్ అయిన పోలీస్ వాలా వీడియోకు ఇప్పటివరకూ 9.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఫేస్ బుక్ యూజర్లు.. కొత్త వాహన చట్టం నిబంధనలు, ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న సునీల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.