Saffron Tea : మతిమరుపుకు మంచి ఔషధం…కుంకుమ పువ్వు టీ..

అందుకే కుంకుమపువ్వుతో టీని తయారు చేసుకుని తాగితే మానసిక ప్రశాంత కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఇది దోహదం చేస్తుంది.

Saffron Tea : మతిమరుపుకు మంచి ఔషధం…కుంకుమ పువ్వు టీ..

Saffron Tea

Saffron Tea : అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో కుంకమ పువ్వు ఒకటి. దీనిలో అధిక పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఐరన్, మెగ్నీషియం, కాల్సియం, పొటాషియం, జింక్, కాపర్,సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ప్రొటీన్, ఫైబర్ అనేక పోషకాలను కుంకుమ పువ్వు కలిగి ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తారు.

అందుకే కుంకుమపువ్వుతో టీని తయారు చేసుకుని తాగితే మానసిక ప్రశాంత కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఇది దోహదం చేస్తుంది. ఈ కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్ కారణంగా మతిమరుపు దూరమై, మెదడు చురుగ్గా తయారవుతుంది. వేగంగా పనిచేసేందుకు ఇది ఉపకరిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు ఈ కుంకుమ పువ్వు టీ తాగటం వల్ల నిద్రబాగా పడుతుంది.

కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ నియంత్రణకు, శరీరంలో వాపుల తగ్గించటంలో ఉపకరిస్తాయి. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను నివారించటంలో ఈ టీ బాగా పనిచేస్తుంది. మహిళలకు కొత్త శక్తిని అందిస్తుంది.

కుంకుమపువ్వు టీ ఎలా తయారు చేయాలి ;

కుంకుమపువ్వు టీ చేయడానికి ముందుగా టీ పాట్‌లో 2 కప్పుల నీరు పోయాలి. అందులో 2 లేదా 3 కుంకుమపువ్వు రేఖలు వేసి బాగా మరిగించాలి. దాంట్లో 3 పుదీనా ఆకులు , చిన్న సైజు అల్లం ముక్కను వేసుకోవాలి. జోడించండి. కొద్ది మరగనివ్వాలి. కొద్ది క్షణాల్లోనే కుంకుమపువ్వు టీ రెడీ అవుతుంది. రుచి కోసం కావాలనుకుంటే నిమ్మ, తేనెను కలుపుకోవచ్చు.