Magnetic Helmet: మెదడులో కణితులను కరిగించే హెల్మెట్..!

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేసే హెల్మెట్లు మెదడులోని కణితిలను గుర్తు పట్టగలవని మనకు తెలుసు. కొత్తగా వాటిని నయం చేసే హెల్మెట్ కూడా కనిపెట్టేశారు. లేటెస్ట్ న్యూరాలాజికల్ ఎక్స్‌పర్మంట్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Magnetic Helmet: మెదడులో కణితులను కరిగించే హెల్మెట్..!

Brain Tumor Magnetic Helmet

Magnetic Helmet: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేసే హెల్మెట్లు మెదడులోని కణితిలను గుర్తు పట్టగలవని మనకు తెలుసు. కొత్తగా వాటిని నయం చేసే హెల్మెట్ కూడా కనిపెట్టేశారు. లేటెస్ట్ న్యూరాలాజికల్ ఎక్స్‌పర్మంట్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హెల్మెట్ క్రియేట్ చేసే మ్యాగ్నటిక్ ఫీల్డ్‌తో మెదడులో కణితిని కుచించుకుపోయేలా చేయొచ్చని తెలిసింది.

కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న 53ఏళ్ల ఓ పేషెంట్ వేరే గాయం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కాకపోతే అతనికి చేసిన పోస్టు మార్టంలో బ్రెయిన్ లో ఉన్న కణితి 31శాతం తగ్గిపోయినట్లుగా గమనించారు. ఇంకా ఈ టెస్టులో గ్లియోబ్లాస్తమా అని పిలిచే ప్రాణాంతక బ్రెయిన్ క్యాన్సర్ కు తొలి సారి నాన్‌ఇన్వాసివ్ థెరపీ జరిగినట్లు తెలిసింది.

ఈ హెల్మెట్ లో మూడు రొటేట్ అయ్యే మ్యాగ్నట్స్ ఉన్నాయి. రీచార్జబుల్ బ్యాటరీతో కనెక్ట్ అయి ఉండే మైక్రోప్రోసెసర్ ఎలక్ట్రానిక్ కంట్రోలర్ అమర్చారు. థెరపీలో భాగంగా పేషెంట్ దీనిని కొద్ది వారాల పాటు భార్య సహాయంతో దానిని తలకే ఉంచుకున్నాడు. మ్యాగ్నటిక్ ఫీల్డ్ థెరఫీలో భాగంగా రోజుకు కనీసం రెండు గంటల నుంచి ఆరు గంటల పాటు ధరించాలని చెప్పారు.

ఆ సమయంలో కణితిలో ఉండే పదార్థం కరిగిపోయి మూడో వంతుకు కుచించుకుపోయింది. ఈ డివైజ్ ట్రీట్మెంట్ చేసేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కూడా దక్కించుకుంది. ఈ టెక్నిక్ ఇంప్రూవ్ అయి ఏదో ఒక రోజు బ్రెయిన్ క్యాన్సర్ కు రేడియేషన్, కీమోథెరఫీ లేకుండానే ట్రీట్ చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.