Acne Problem : యుక్త వయస్సులో మొటిమల సమస్య!

కొందరిలో మొటిమలు వస్తే తీవ్రమైన నొప్పి , అసౌకర్యానికి కలిగిస్తాయి. చర్మాన్ని శుభ్రంచేసుకోవటం వల్ల బ్లాక్‌హెడ్స్, మొటిమలను వదిలించుకోవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే చర్మం యొక్క ఉపరితలం క్రింద బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి.

Acne Problem : యుక్త వయస్సులో మొటిమల సమస్య!

Acne Problem

Acne Problem : యుక్త వయసు వచ్చిందంటే చాలు చాలా మందిలో మొటిమల సమస్య మొదలవుతుంది. చర్మంపై వచ్చే మొటిమలు కారణంగా ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య కారణంగా నలుగురిలో తిరగాలన్న చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మొఖంపై ఈ మొటిమల కారణంగా ఏర్పడే మచ్చలు ముఖ సౌందర్యానికి అడ్డంకిగా మారతాయి. అధిక కొవ్వు ఉండే ఆహారాలను తీసుకోవడం, చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం, అదనపు నూనె ఉత్పత్తి, బాక్టీరియా వంటి రకరకాల కారణాల వల్ల మొటిమలు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భం , ఋతుస్రావంతో సహా హార్మోన్లలో మార్పులు , ధూమపానం వంటివి మొటిమల సమస్యకు కారణమౌతాయి.

కొందరిలో మొటిమలు వస్తే తీవ్రమైన నొప్పి , అసౌకర్యానికి కలిగిస్తాయి. చర్మాన్ని శుభ్రంచేసుకోవటం వల్ల బ్లాక్‌హెడ్స్, మొటిమలను వదిలించుకోవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే చర్మం యొక్క ఉపరితలం క్రింద బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. ఈ ఆయిల్ వంటి పదార్ధాన్నే సెబమ్ అని కూడా పిలుస్తారు, మొటిమలోపలి భాగంలో తెల్లటి పదార్ధం ఉంటుంది. చర్మ సౌందర్యం కోసం ఉపయోగించే వివిధ రకాల ఫ్యాషన్ ఉత్పత్తులు సైతం మొటిమల సమస్యకు కారణమౌతాయి. ఒత్తిడి కారణంగా కూడా మొటివలు వస్తాయి. మొటిమలు వచ్చినప్పుడు వాటిని గోర్లతో వత్తటం, చిదమటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల నొప్పితో పాటు , పుండు మరింత పెద్దదిగా మారుతుంది. అయితే మొటిమల సమస్యను నిరోధించేందుకు కొన్ని చిట్కాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. పుదీనా, తులసి ఆకులు మెత్తగా నూరి మొటిమలు వచ్చిన ప్రాంతంలో అప్లై చేయాలి. తులసి ఆకులు నూరి పెరుగులో కలిపి రాసినా ఫలితం ఉంటుంది.

అర కప్పు పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తరువాత అందులో చిటికెడు కుంకుమ పువ్వు, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని దూది సాయంతో మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి. టమాట పండ్ల రసం తీసి మొటిమల మీద రాసి ఓ గంట తర్వాత ముఖం చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి. వేపాకులు పొడిలో నిమ్మరసం రాసుకుని ముఖానికి రాసినా మొటిమలు తగ్గుతాయి. యాపిల్‌ గుజ్జు ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కుంటే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతం అవుతుంది.