ఢమరుకం మోగిస్తూ..శివుడి గెటప్‌లో శ్రీరెడ్డి చిందులు..

10TV Telugu News

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటి శ్రీరెడ్డి కొత్త గెటప్ లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. పరమశివుడి గెటప్‌లో కనిపించేసరికి ప్రేక్షకులు నెరెళ్లబెట్టారు. టిక్ టాక్ వీడియోలో… ఢమరుకం మోగిస్తూ…సన్యాసులతో కలిసి చిందులేసింది. శివుడి గెటప్ లో ఉన్నా తనదైన శైలిని మాత్రం శ్రీరెడ్డి తగ్గలేదు. 

శ్రీరెడ్డి స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ ఇటువంటి గెటప్ లో ఎవ్వరూ చూసి ఉండని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. శ్రీరెడ్డి ఏంటి… సడెన్‌గా ఈ షాకింగ్ గెటప్ ఏంటీ??ఈ  వీడియో ఏంటి అనుకుంటున్నారు. 

కాంట్రవర్శీలకు దూరంగా ఉంటున్నానని చెబుతున్న శ్రీరెడ్డి… తాజాగా… తన ఉనికి మాత్రం వెల్లడిస్తూనే ఉంది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని అందులో వంటలు, మేకప్ టిప్స్ వంటివి చెప్పేస్తోంది. ఇలా తన కెరీర్ డెవలప్‌మెంట్‌లో భాగంగానే ఆమె… ఇటీవల ఫెస్టివల్స్, స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఇలా ప్రత్యేక గెటప్స్‌లో కనిపిస్తోందని అంటున్నారు కొందరు. ఏది ఏమైతేనేం…ఈ తాజా వీడియోతో శ్రీరెడ్డి మరోసారి తన స్టైల్ ని కనబరిచింది. 

శివుడి గెటప్ లో ఉన్న శ్రీరెడ్డిపై తమదైన శైలిలో నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.శ్రీరెడ్డికి శివుడి గెటప్ అస్సలు సూట్ కాలేదని కొందరు అంటుంటే…శివుడిలాగే ఉందని మరికొందరు కామెంట్స్ రాస్తున్నారు. ఆమె తనలో మరో టాలెంట్‌ను ఈ వీడియో ద్వారా బయటపెట్టిందని ఇంకొందరు అంటున్నారు. ఎవరి ఏమన్నా..వ్యూస్ పెంచుకుంటూ… శివుడి గెటప్ లో చిందులు వేస్తున్న ఈ వీడియో వైరల్ వైపుగా పరుగులు పెడుతోంది. దటీజ్ శ్రీరెడ్డి కదా అనిపిస్తోంది. 

×