Children Infections : పిల్లలపై శీతాకాల వైరస్‌ల విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు.. నిండిపోతున్న ఆస్పత్రులు!

ప్రపంచమంతా కరోనాతో వణికిపోతోంది.. ఇప్పటికే పెద్దలు, యువకులను పట్టిపీడించిన మహమ్మారులు పిల్లలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందంటూ పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూకే వ్యాప్తంగా చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు.

Children Infections : పిల్లలపై శీతాకాల వైరస్‌ల విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు.. నిండిపోతున్న ఆస్పత్రులు!

A&e Units In Uk Report Rapid Rise In Children’s Infections

Children Infections : ప్రపంచమంతా కరోనాతో వణికిపోతోంది.. ఇప్పటికే పెద్దలు, యువకులను పట్టిపీడించిన మహమ్మారులు పిల్లలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందంటూ పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూకే వ్యాప్తంగా చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. A & E యూనిట్లలోని అన్ని మెడికల్ డిపార్టమెంట్లు రికార్డు స్థాయిలో నిండిపోయాయి. చాలామంది చిన్నారుల్లో ఎక్కువగా స్వల్ప జ్వరం ఉంటోంది. ఆ పిల్లలకు ఇంటివద్దే చికిత్స అందిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో మాత్రమే విజృంభించే వైరస్ లతో కలిగే వ్యాధులతో చిన్నారులు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవుతున్నారు. దాంతో పిల్లల తల్లిదండ్రులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో జ్వరం ఎక్కువగా కనిపించడంతో పాటు ఊపిరితీసుకోలేపోతున్నారు. దాంతో ఎమర్జెనీ డిపార్ట్ మెంట్లకు వచ్చే పిల్లల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.

A&E యూనిట్లు ఒకరోజులోనే 300పైనా కేసులు రావడంతో అన్నీ నిండిపోయాయని యూకే వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరిన పిల్లల సంఖ్యతో కొత్త రికార్డు నమోదైందని అంటున్నారు. జ్వరంతో వాట్ఫోర్డ్ జనరల్ ఆసుపత్రిలో చేరిన పిల్లల సంఖ్య ఫిబ్రవరి ఆరంభంలో వారానికి 20 నుంచి ఈ నెల ప్రారంభంలో 100కు పైగా పెరిగిందన్నారు. 2020 కన్నా జూన్ మొదట్లో జ్వరాలతో చేరిన పిల్లల సంఖ్య కంటే మూడు రెట్లు పెరిగాయని A & E కన్సల్టెంట్ శిశువైద్యులు వెల్లడించారు. సాధారణంగా శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ (RSV), బ్రోన్కియోలిటిస్, పారాఫ్లూ లేదా రినోవైరస్ వంటి వైరస్ లు సోకితే.. వారిలో దగ్గు, ముక్కు కారటం, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

తేలికపాటి వ్యాధులు ఎక్కువగా శీతాకాలంలో కనిపిస్తాయి. లాక్ డౌన్ సడలింపుతో వేసవిలో పిల్లలు ఇతర పిల్లలతో కలవడం ద్వారా వ్యాధుల బారినపడుతున్నారని యూకే వైద్యులు తెలిపారు. గ్లాస్గో, బర్మింగ్‌హామ్ లివర్‌పూల్‌లోని స్పెషలిస్ట్ పిల్లల ఆస్పత్రుల్లో నిర్వహించిన ఒక సర్వేలో మే నెలలో 23,661 మంది పిల్లలు A & E యూనిట్లలో చేరినట్టు తేలింది. అప్పట్లో ఇదే అత్యధిక సంఖ్య. 2019లో, కోవిడ్ ముందు ఈ యూనిట్లలో చేరిన పిల్లల సంఖ్య 21,046గా ఉంది. 70శాతం కంటే ఎక్కువ మంది చిన్నారులు చేరగా.. అందులో 25శాతం మందికి ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కోసం చేరారు.

నెలల తరబడి ఇంట్లోనే ఉన్నప్పటికీ ఎవరితో కలవనప్పటికీ పిల్లల రోగనిరోధక శక్తిలో మార్పు ఉండదని చెప్పారు. కొంతమంది పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉందంటున్నారు. కొందరు ఈ వైరస్ ల కారణంగా అనారోగ్యానికి గురికారు. వ్యాధుల బారినపడిన చిన్నారులకు పారాసెటమాల్ లేదా ఇబుప్రోఫెన్ ఇవ్వడంతో పాటు జిపి, ఫార్మసీ లేదా 111 టెలిఫోన్ హెల్ప్ లైన్‌ ద్వారా వైద్యసాయం కోరవచ్చునని తల్లిదండ్రులకు సూచించారు. ఇంగ్లాండ్‌లోని NHS పిల్లలలో అంటువ్యాధుల పెరుగుదలను ఎదుర్కోవటానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పిల్లల కోసం NHS 111, GPలు ఫార్మసీలు అందుబాటులో ఉంచుతోంది.