Covid-Heatwaves : కరోనా తర్వాత మరో ముప్పు.. విరుచుకుపడనున్న రాకాసి వడగాలులు?

ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతోంది. కరోనావైరస్ తర్వాత మరో ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రపంచం మరో ముప్పు ఎదుర్కోవాల్సి ఉందంటున్నారు.

Covid-Heatwaves : కరోనా తర్వాత మరో ముప్పు.. విరుచుకుపడనున్న రాకాసి వడగాలులు?

After Covid, Could The Next Big Killer Be Heatwaves

Covid-Heatwaves : ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతోంది. కరోనావైరస్ తర్వాత మరో ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రపంచం మరో ముప్పు ఎదుర్కోనుందని చెబుతున్నారు. రాబోయే ఏళ్లల్లో రాకాసి వడగాలులు విరుచుకపడనున్నాయట.. మిలియన్ల మంది చనిపోతారట.. ఎవరూ కూడా ప్రాణాలతో తప్పించుకోలేనంతగా వేడిగాలులు వీస్తాయట.. రక్తం మరిగిపోయి శరీరమంతా వేడిగా మారిపోతుందట.. ఇది ఓ కొత్త సైన్స్ ఫిక్చన్ నవలలోనిది.. భయానకమైన ఈ ముప్పు సైంటిఫిక్‌గా వాస్తవానికి దూరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు.

గ్లోబల్ వార్మింగ్ అదుపు తప్పి అలానే కొనసాగితే మాత్రం బిలియన్ల మంది జీవనానికి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మునుపటి ఉష్ణోగ్రతల నమూనాల ఆధారంగా హీట్ వేవ్స్ పుట్టుకురానున్నాయి. మరో శతాబ్దంలో కార్బన్ కాలుష్యం కారణంగా ఈ ముప్పు సంభవించే అవకాశం ఉందని నివేదికలు సూచించాయి. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నివేదిక ప్రకారం.. ప్రాణాంతకమైన కిల్లర్ హీట్ వేవ్స్ రాబోతున్నాయనే హెచ్చరికలు వస్తున్నాయి. ప్రపంచంలో 1.5 డిగ్రీల సెల్సియస్.. నేటి స్థాయి కంటే 0.4 డిగ్రీలు వేడెక్కితే.. జనాభాలో 14 శాతం మంది కనీసం ఐదేళ్లకు ఒకసారి తీవ్రమైన వడగాలులకు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సగం డిగ్రీకి వెళితే మరో 1.7 బిలియన్ల మంది దీని బారినపడే అవకాశం ఉందంటున్నారు.

కరాచీ నుంచి కిన్షాసా వరకు.. మనీలా నుంచి ముంబై వరకు, లాగోస్ నుంచి మనౌస్ వరకు రాకాసి వడగాలుల తీవ్రతకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా మెగాసిటీలే ఈ సమస్యకు గురవుతాయని చెబుతున్నారు. థర్మామీటర్ రీడింగులు మాత్రమే కాదు.. అధిక తేమతో కలిస్తే మాత్రం వేడి మరింత ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. గాలి పొడిగా ఉంటే.. అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం చాలా సులభమని అంటున్నారు. ఉష్ణోగ్రతలు (TW) 35 డిగ్రీల సెల్సియస్ దాటితే ఆరోగ్యకరమైనవారు కూడా మనుగడ సాగించలేరని నిపుణులు అంటున్నారు.

బ్రెజిల్, పెరూ, కొలంబియా, ఫిలిప్పీన్స్, కువైట్, గ్వాటెమాలో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చునని అంటున్నారు. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలు 2080 నాటికి ప్రతి ఏడాదిలో కనీసం 30 రోజుల వరకు తీవ్రమైన వేడి గాలలు వీచే అవకాశం ఉందని IPCC నివేదిక పేర్కొంది. ఐరోపాలో 2100 వరకు ప్రపంచం రెండు డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కినట్లయితే, శతాబ్దం మధ్య నాటికి 200 మిలియన్ల మంది వరకు రాకాసి వడగాలలకు గురయ్యే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.