Wife And Husband : పెళ్లయి మూడేళ్లు.. ఆ ముచ్చట తీరలేదు.. కట్ చేస్తే భర్త అదని తెలిసి షాక్

పెళ్ళై మూడేళ్లైనా కార్యం కాకపోవడంతో ఓ మహిళ కోర్టు మెట్లెక్కింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. తీర్పు రానుంది

10TV Telugu News

Wife And Husband : పెళ్ళై మూడేళ్లవుతుంది.. కానీ ఆ దంపతుల మధ్య ఇప్పటికి కార్యం కాలేదు. భార్య ఎంత ప్రయత్నించినా.. భర్త కార్యం దాటవేస్తూ వచ్చేవాడు. పెళ్ళై మూడేళ్లయినా దాంపత్య జీవితంలో సుఖం లేదు. మరోవైపు పిల్లలు పుట్టడం లేదని అత్తింటివారి సూటిపోటి మాటలు. ఇవ్వన్నీ భరించలేని ఓ మహిళ భర్త గురించి తెలుసుకోవాలనుకుంది. ఎప్పుడూ ఫోన్‌తో బిజీగా ఉండే భర్త ఫోన్‌ను లాక్కుని చూడడంతో ఆమె షాక్‌కు గురయ్యింది. ప్రస్తుతం వీరి దాంపత్య జీవనం కోర్టు మెట్లు ఎక్కింది. విడాకులు కావాలని భార్య న్యాయస్థానంలో పోరాడుతోంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

31 ఏళ్ల బ్యాంకు ఉద్యోగితో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి 2018 జూన్‌లో వివాహమైంది. అతడికి ఇది రెండో వివాహం. పెళ్లయినప్పటి నుంచి ఆమెతో పడక గదిలో గడపడం లేదు. ఏమని ప్రశ్నిస్తే మొదట్లో అదనపు కట్నం తెస్తేనే అని పట్టుబట్టాడు. దీంతో కట్నం విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి మరి అడిగినంత తెచ్చి ఇచ్చింది. అయినా అతడు ఆమె దగ్గరకు వచ్చేవాడు కాదు. అడిగిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు.

ఇలా ఏకంగా మూడేళ్ల పాటు దూరం పెడుతున్నాడు. అయితే అతడు తరచూ ఫోన్‌లో బిజీగా ఉన్నాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. తనని మోసం చేసి వేరే యువతితో ఏమైనా సంబంధం నడుపుతున్నాడేమో అనుకుంది. ఎలాగోలా తన ఫోన్ తీసుకోని చెక్ చేసింది. ఆ ఫోన్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అతడు మగవారితో చాట్ చేస్తున్నట్లు, గే సైట్ లో కూడా ప్రొఫైల్ రిజిస్టర్ అయినట్లు గురించింది. వెంటనే అతడిని నిలదీయగా అసలు రహాస్యం బహిర్గతపరిచాడు.

తాను స్వలింప సంపర్కుడినని.. గే డేటింగ్‌ యాప్‌లలో ప్రొఫైల్‌ ఉందని అంగీకరించాడు. దీంతో ఆమె అతడితో విడిపోవాలని నిశ్చయించుకుంది. వెంటనే ఆమె బవసణ్నగుడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు సోమవారం కోర్టులో విచారణ కొనసాగింది. విచారణ అనంతరం న్యాయస్థానం కేసును వాయిదా వేసింది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం ముందే తెలిసీ తనకు అతడితో పెళ్లి చేశారని బాధితురాలు భర్త కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. న్యాయ పోరాటానికి దిగింది.

10TV Telugu News