Aging : 40వయస్సులో వృద్ధాప్యఛాయలా? అయితే జాగ్రత్త పడాల్సిందే!

ఇటీవలి కాలంలో వాతావరణ కాలుష్యం, తీసుకునే ఆహారంలో పోషక లోపాల కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. విపరీతమైన ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా నుదుటిపై ముడతలు పెరుగుతాయి.

Aging : 40వయస్సులో వృద్ధాప్యఛాయలా? అయితే జాగ్రత్త పడాల్సిందే!

Aging At 40

Aging : వయస్సు 40 సంవత్సరాలు పైబడితే చాలా వృద్ధాప్య ఛాయలు వెంటాడుతూ ఉంటాయి. యవ్వనంగా ఉండాలని కోరుకున్నప్పటికీ ముడ‌త‌లు, మ‌చ్చ‌లు, స‌న్న‌ని చార‌లు, చ‌ర్మం పొడి బార‌డం ఇలా అనేక స‌మ‌స్య‌లు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇలాంటి వాటి నుండి బయటపడాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించటం అవసరం. టమాటాతో పాటు క్యారెట్, బీట్‌రూట్‌, కీర దోస‌కాయ‌, పాల‌కూర‌, బచ్చలికూర, మెంతికూర వంటివి కూడా డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌టంతో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఆహారంలో రోజూ క్యారెట్‌, చాక్లెట్‌ ఉండేలా చూసుకోవాలి. గ్రీన్‌ టీ చర్మానికి లైకోపిన్‌ అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలుష్యం నుంచి తనను తాను రక్షించుకునే శక్తిని చర్మానికిస్తుంది.

రోజూ అరగంట వ్యాయామం చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. స్నానానికి ముందు ముఖానికి చేసే మసాజ్‌ చర్మకణాలను ఉత్తేజపరిచి రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. చర్మానికి సాగే గుణాన్ని అందించి ముడతలకు దూరంగా ఉంచుతుంది. నిద్రపోయే ముందు మేకప్‌ను తొలగించి, శుభ్రపరచాలి. తర్వాత బాదం లేదా ఆలివ్‌నూనె మర్దన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, ఆకుపచ్చని కూరగాయల రసాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉప్పు, చక్కెరకు దూరంగా ఉండాలి. చర్మానికి అవసరమయ్యే పోషకాల కోసం ప్రత్యేకించి విటమిన్‌-సి, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందించాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్‌ టీ, పాలకూర, వాల్‌నట్స్‌, చిలగడ దుంప, బ్లూ బెర్రీ… మొదలైనవన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.

శరీరానికి సరిపడా నీటిని తీసుకోకపోతే చర్మం పొడిబారే ప్రమాదముంది. ఫలితంగా నుదుటి మీద పెద్ద పెద్ద గీతలు, ముడతలు ఏర్పడతాయి. ద్రవ రూపంలో 3లీటర్ల నీటిని రోజువారీగా శరీరానికి అందించాలి. దీంతో చర్మంలో మురికి బయటకు పోయి తేమగా మారుతుంది. నిద్రలేచిన తర్వాత లేదా నిద్రపోయే ముందు ఫేషియల్‌ యోగా ముఖ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్రీన్ టీ చ‌ర్మాన్ని నిత్య‌య‌వ్వ‌నంగా ఉంచ‌డంలోనూ స‌హాయ‌ప‌డ‌తాయి. కాబ‌ట్టి, ప్ర‌తి రోజు ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకోవ‌టం వల్ల చర్మానికి మేలు కలుగుతుంది. ఎనిమిది గంటల నిద్రతో ఒత్తిడి దూరమైన చర్మం ఆరోగ్యంగా మారటంతోపాటు ప్రకాశవంతాగా ఉంటుంది.

ఇటీవలి కాలంలో వాతావరణ కాలుష్యం, తీసుకునే ఆహారంలో పోషక లోపాల కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. విపరీతమైన ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా నుదుటిపై ముడతలు పెరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి, మానసిక ఆందోళనలను అదుపులో పెట్టుకోవచ్చు. యోగా, మెడిటేషన్‌, వర్కవుట్లను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు, వర్కవుట్లతో ముడతలు పెరగకుండా జాగ్రత్త పడచ్చు. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షించుకోవటానికి సన్‌స్ర్కీన్‌ లోషన్ అప్లై చేసుకోవాలి. చర్మంలో మార్పులు చోటు చేసుకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా వాడుకోవాలి. వృద్ధాప్య ఛాయలను త్వరగా దరికి చేరనివ్వదు.