రూ.60వేల పెనాల్టీ : అతడికి HIV.. రిషికేశ్ AIIMS రాంగ్ రిపోర్ట్!

ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే చాలు.. వెంటనే ఆస్పత్రికి పరిగెత్తుతాం. ఆస్పత్రిలో చికిత్స అందిస్తారనే నమ్మకంతోనే కదా?. ఆస్పత్రుల్లో డాక్టర్ చెప్పిన ప్రతిమాటను దేవుడి వాక్కుగా తీసుకుంటాం.

  • Edited By: sreehari , May 7, 2019 / 09:18 AM IST
రూ.60వేల పెనాల్టీ : అతడికి HIV.. రిషికేశ్ AIIMS రాంగ్ రిపోర్ట్!

ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే చాలు.. వెంటనే ఆస్పత్రికి పరిగెత్తుతాం. ఆస్పత్రిలో చికిత్స అందిస్తారనే నమ్మకంతోనే కదా?. ఆస్పత్రుల్లో డాక్టర్ చెప్పిన ప్రతిమాటను దేవుడి వాక్కుగా తీసుకుంటాం.

ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే చాలు.. వెంటనే ఆస్పత్రికి పరిగెత్తుతాం. పెద్ద ఆస్పత్రుల్లో డాక్టర్ చెప్పిన ప్రతిమాటను దేవుడి వాక్కుగా తీసుకుంటాం. వాళ్లు చెప్పిన సూచనలను క్రమం తప్పకుండా పాటిస్తాం. సూచించిన టెస్టులన్ని చేయించుకుంటాం. అదే పెద్ద ఆస్పత్రులు.. నిర్లక్ష్యంతో పేషెంట్లకు తప్పుడు రిపోర్ట్ ఇస్తే పరిస్థితి ఏంటి? లేని జబ్బును ఉందని చెబితే.. ఆ పేషెంట్ జీవితం, అతడి ఫ్యామిలీ పరిస్థితి ఏమౌతుంది.. లేని ప్రాణాంతక జబ్బు తనకు ఉందని తెలిసి ఆ పేషెంట్ మానసికంగా ఎంతో కృంగిపోతాడు. అతడి కుటుంబం కూడా చిన్నాభిన్నమైపోతుంది.

ఒక ఆస్పత్రి ఇచ్చిన రాంగ్ రిపోర్ట్ కారణంగా ఇంతమంది జీవితాలు చీకటిమయంగా మారిపోతాయనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి పరిస్థితే రిషికేశ్ ప్రాంతంలోని ఓ వ్యక్తికి ఎదురైంది.. పేరుకు అదో పెద్ద ఆస్పత్రి.. చికిత్స కోసం వెళ్లిన ఓ వ్యక్తికి హెచ్ఐవీ ఉందంటూ రిపోర్ట్ ఇచ్చింది. రిషికేశ్ లోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) హరిద్వార్ లోని భగవాన్ పూర్ కు చెందిన నసీం అలీ అనే వ్యక్తికి హెచ్ఐవీ సోకినట్టు రిపోర్ట్ ఇచ్చింది. దీంతో నసీం షాక్ అయ్యాడు. గాయం మానడం లేదని ట్రీట్ మెంట్ కోసం వెళ్తే.. హెచ్ఐవీ ఉందంటారేమిటి? అని నివ్వెరపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. 

ఎయిమ్స్ ఆస్పత్రికి కంటే ముందు అలీ.. గాయానికి చికిత్స కోసం.. 2014, జూన్ 12న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే.. గాయం దగ్గర చికిత్స చేసినప్పటికీ రక్తం గడ్డకట్టడం లేదు.. దీంతో అలీని మరో ఆస్పత్రికి తరలించారు.. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. అయినా తగ్గలేదు. ఆస్పత్రి వైద్యులు రిషికేశ్ ఎయిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఎయిమ్స్ లో అలీకి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో నసీంకు హెచ్ఐవీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. హెచ్ఐవీ ఉందని తెలియడంతో నసీం మానసికంగా కృంగిపోయాడు.. ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడ్ని మరో ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ మరోసారి టెస్టులు చేయించారు.

2014, జూలై 28న వచ్చిన ఆ రిపోర్టుల్లో నసీంకు హెచ్ఐవీ నెగిటీవ్ అని తేలింది. తనకు ఎయిమ్స్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని తెలిసి నసీం ఆగ్రహం వ్యక్తం చేశాడు. జనవరి 2015న కంజ్యూమర్ కోర్టులో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. తనకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి తనను మానసిక వేదనకు గురయ్యేలా చేసిందంటూ ఫిర్యాదులో తెలిపాడు. నసీం అభ్యర్థనపై విచారించిన కోర్టు.. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే తప్పుడు రిపోర్ట్ ఇచ్చినట్టు భావించింది. దీంతో సదరు ఆస్పత్రికి 60వేల పెనాల్టీ వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నెలలోగా నసీంకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.