Ajaita shah : అజైత‌ షా..ఇ-కామర్స్‌తో దాణా వ్యాపారాన్ని జత చేసిన ఆంట్రప్రెన్యూర్

ఒక ఆలోచన ఎంతో మంది జీవితాల్ని మార్చేస్తుంది. అలా సామాజిక వ్యాపార విజయంతో ‘అండర్‌ 30 పవర్‌ఫుల్‌ విమన్‌’గా ఫోర్బ్స్‌ జాబితాలోనూ చేరిన అజైతా షా ప్రస్థానం ఆదర్శంగా నిలుస్తోంది.

Ajaita shah : అజైత‌ షా..ఇ-కామర్స్‌తో దాణా వ్యాపారాన్ని జత చేసిన ఆంట్రప్రెన్యూర్

Ajaita Shah..ceo Of Frontier Markets

ajaita shah..CEO of Frontier Markets  : కరోనా వల్ల వచ్చిన లాక్‌డౌన్‌లో కొంతమందికి లేనిపోని సమస్యలు తెచ్చిపెడితే..మరికొంతమంది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకున్నారు. అటువంటివారిలో మహిళా వ్యాపారవేత్త అజైత షా ఒకరు. లాక్‌డౌన్‌లో వచ్చిన ఒక్క చిన్న ఆలోచ‌న అజైత షా జీవితాన్నే మార్చేసింది. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తించి.. ఎన్నడూ ఎవ్వరు కూడా ఊహించనటువంటి ఉపద్రవంగా వచ్చి పడింది కరోనా. చైనాలో 20219లో కోవిడ్ కకావికలం చేసింది. తరువాత అతి ప్రపంచదేశాల్ని చుట్టేసింది. అలా 2020 లో వచ్చిన లాక్ డౌన్ లో అజైత షా కు వచ్చింది..ఇ-కామర్స్‌తో దాణా వ్యాపారాన్ని జత చేసే యోచన. అలా ఆంత్రప్రెన్యూర్‌ గా అజైత మరో మెట్టు ఎక్కారు.

Read more : Forbes list :ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు..6వ స్థానంలో జయశ్రీ ఉల్లాల్

కానీ అటువంటి పీడకలలాంటి సంవత్సరంలో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు జైపూర్‌కు చెందిన అజైత షా. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ లో ఆమెకు వచ్చిన ఓ ఆలోచనతో ఇ-కామర్స్‌తో దాణా వ్యాపారాన్ని జతచేశారామె.  లాక్‌డౌన్‌ ఆంక్షల మధ్య అందరు ఆన్‌లైన్‌లోనే అన్నీ ఆర్డర్‌ చేసుకుని హాయిగా ఇంట్లోనే కాలక్షేపం చేశారు. ముఖ్యంగా నగరవాసులు.మరి గ్రామాల్లో అటువంటి సౌకర్యం లేదు. ఆన్ లైన్ లో కూరగాయాలు, నిత్యావసర వస్తువులు, ఫుడ్ డెలీవరీ సౌకర్యాలు లేవు. దీంతో గ్రామ ప్రజలు దగ్గరలో ఉండే టౌన్ కు ఆంక్షల సడలింపు సమయంలోనే అన్ని తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఏదోరకంగా జనాలు ఏవో తిప్పలు పడి నానా తంటాలు పడి సరుకులు తెచ్చుకునేవారు. ఓ మాదిరి గ్రామాలై పరిస్థితి ఫరవాలేదు. మరి మారు మూల గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. కారణం లాక్ డౌన్ తో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.దీంతో మారుమూల గ్రామవాసులు..ఇబ్బందులు పడ్డారు. వారి సంగతి ఎలా ఉన్నా..పశువుల దాణా కోసం ఇబ్బందులు పడ్డారు.

Read more : 6 richest women : భారత్ లో ధనిక మహిళలు..ఫస్ట్ ప్లేస్ లో సావిత్రి జిందాల్

అదే ఆలోచన చేశారు అజైత. మారుమూల పల్లెల్లో పశువులకు దాణా ఎలా? అని ఆలోచించారు అజైత షా. రోజూ కిలోమీటర్ల దూరం కాలినడకనే వెళ్లి పశువుల దాణా తెచ్చుకునే గ్రామీణ మహిళలకు పరిష్కారం చూపాలనుకున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటికే దాణా చేరే అవకాశాన్ని కల్పించారు అజైత. అది లాక్ డౌన్ తరువాత కూడా మారుమూల ప్రాంత వాసులకు బాగా ఉపయోగపడింది. అలా ఇప్పటివరకు రెండులక్షల మంది మహిళలకు పది లక్షల దాణా సంచులను సరఫరా చేశారు. దాణా వ్యాపారాన్ని ఇ-కామర్స్‌తో జతచేసి అత్యంత శక్తిమంతురాలైన ఆంత్రప్రెన్యూర్‌గా నిలిచారు అజైత షా. న్యూయార్క్‌లో పుట్టిపెరిగిన అజైతకు గ్రామీణ ప్రాంతాల్లో జనజీవనం గురించి పెద్దగా తెలియదు. కానీ ఆ ఆలోచన వచ్చాక తెలుసుకున్నారు.అజైతకు చదువు అయిపోగానే ఇండియా వచ్చేసారు.

పల్లెలకు ఇ-కామర్స్‌ను విస్తరిస్తూ ‘ఫ్రాంటియర్‌ మార్కెట్స్‌’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం రెండున్నర వేల గ్రామాల్లో 10,000మంది మహిళా ఏజెంట్లు ఉన్నారు ‘ఫ్రాంటియర్‌ మార్కెట్స్‌’ సంస్థకు. సామాజిక వ్యాపార విజయంతో ‘అండర్‌ 30 పవర్‌ఫుల్‌ విమన్‌’గా ఫోర్బ్స్‌ జాబితాలోనూ చేరారు అజైత షా. అలా గ్రామీణ మహిళలతో మమేకం అవుతు..ఎన్నో చేస్తున్నారు. తన వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. అలా సామాజిక వ్యాపార విజయంతో ‘అండర్‌ 30 పవర్‌ఫుల్‌ విమన్‌’గా ఫోర్బ్స్‌ జాబితాలోనూ చేరారు అజైత.

Read more :  అజైతా షా 2011లో ఫ్రాంటియర్ మార్కెట్స్ ప్రారంభించారు.  గ్రామీణ ప్రాంత మహిళల కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పేరుతో ప్రారంభమైన సంస్థకు ఆమె సీఈవో పలు కార్యక్రమాల్లో కొనసాగుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ సంస్థ బేస్ ఆఫ్ పిరమిడ్స్ (బీఓపీ) పేరుతో పేదలకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లను అత్యంత నాణ్యతతో, అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు. ఈ రంగంలో ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అజైత షా వినూత్న విధానాలను అవలంభించారు. టుఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాల్లో బీఏ పూర్తి చేసిన అజైతా షా సౌర విద్యుత్‌ను పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.