పురాణాల్లో అక్షయ తృతీయ ప్రత్యేకతలు

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 09:59 AM IST
పురాణాల్లో అక్షయ తృతీయ ప్రత్యేకతలు

అక్షయ తృతీయ.. ఇదేదో బంగారం పండుగ అనుకుంటారు అందరూ. పురణాల్లో మాత్రం ఎంతో విశిష్టత ఉంది ఈ పర్వదినాలకు. ఎన్నో ముఖ్యమైన సంఘటనలు, ఘటనలు ఈ అక్షయ తృతీయ రోజు జరిగినవే. వాటిని ఓ సారి తెలుసుకుందాం..

లక్ష్మీదేవి పుట్టిన రోజు :
– లక్ష్మీదేవి పుట్టిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. అందుకే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ బంగారం కొనుగోలు చేయటం ఓ భాగం అయిపోయింది. లక్ష్మీదేవి పుట్టిన రోజున.. అందుకు ప్రతిరూపం అయితే బంగారాన్ని కొనుగోలు చేస్తే అష్టఐశ్వర్యాలను ఇంటికి తీసుకొచ్చినట్లే అనే ప్రతీతి ఉంది. అందుకే అన్నిటి కంటే ముఖ్యంగా బంగారం పాపులర్ అయిపోయింది.
–  పరశురాముని జన్మదినం కూడా అక్షయ తృతీయ రోజే.
– శివుని శిరస్సు నుంచి పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా ఆ రోజే.
– త్రేతాయుగం మొదలైంది కూడా అక్షయ తృతీయ నాడే
– శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న పవిత్రమైన రోజు.
– వ్యాస మహర్షి మహా భారతంను, వినాయకుని సహాయంతో రాయటం ప్రారంభించిన రోజు.

– సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం. ఈ విధంగానూ అక్షయ తృతీయ అని ఈ పేరు వచ్చిందనే ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.
– శివుడిని ప్రార్థించి.. కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు అదే.
– ఆదిశంకరులు కనక ధారాస్తవం ను చెప్పిన రోజు.
–  అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించింది కూడా అక్షయ తృతీయ నాడే.
– ద్రౌపదిని శ్రీ కృష్ణుడు దుశ్శాసనుని బారి నుంచి కాపాడిన రోజు కూడా ఇదే.
అక్షయ తృతీయకు పురాణాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయి. సో.. వీటిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.