Almond Oil : మృత కణాలను తొలగించి చర్మసౌందర్యాన్ని పెంపొందించే బాదం నూనె!

చర్మానికి కావలసిన తేమను అందించి చర్మం పొడిబారకుండా కాపాడతాయి. చర్మంలో పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయి. చర్మానికి మృదుత్వాన్ని అందించటంలో బాదం నూనె సహాయపడుతుంది. దురద, మంట, అలర్జీ వంటి అన్ని చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

Almond Oil : మృత కణాలను తొలగించి చర్మసౌందర్యాన్ని పెంపొందించే బాదం నూనె!

Almond oil removes dead cells and enhances skin beauty!

Almond Oil : బాదంపప్పు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు నానబెట్టిన బాదంపప్పును తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. అయితే చర్మ సౌందర్యానికి బాదం నుండి తీసిన నూనె ఎంతగానో ఉపకరిస్తుంది. బాదం నూనె యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. రోజువారీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సౌందర్య,జుట్టు సంరక్షణ ఉత్పత్తులైన సబ్బులు, లోషన్లు, లిప్ బామ్స్, షాంపూలు మరియు కండిషనర్లు, బాడీ వాష్, బ్రైటెనింగ్ సీరమ్స్ లలో బాదం నూనెను ఉపయోగిస్తున్నారు.

చర్మానికి చికాకు కలిగించదు. దీర్ఘకాలిక చర్మ పరిస్థితులను నిర్వహించడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్ల కింద అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేస్తే కళ్ల కింద నల్లని వలయాలు తొలగిపోతాయి. చర్మంపై మృతకణాలు తొలగిపోయేలా చేస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. శరీర చర్మాన్ని యవ్వన రూపాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచి ముడతలు పడకుండా చూడటంతోపాటు చర్మానికి సాగేగుణాన్నిబాదం నూనె అందిస్తుంది. చర్మసౌందర్యాన్ని, జుట్టు సౌందర్యాన్ని మెరుగు పరచడంతో పాటు శరీరానికి కూడా మేలు చేస్తుంది.

చర్మానికి కావలసిన తేమను అందించి చర్మం పొడిబారకుండా కాపాడతాయి. చర్మంలో పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయి. చర్మానికి మృదుత్వాన్ని అందించటంలో బాదం నూనె సహాయపడుతుంది. దురద, మంట, అలర్జీ వంటి అన్ని చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మాన్ని కోమలంగా మార్చుతుంది. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్ ల కారణంగా దెబ్బతిన్న చర్మ కణాలను తిరిగి పునరుద్ధరణ చేయడానికి ఉపయోగపడుతుంది.

బాదం నూనెతో చర్మ సౌందర్యాన్ని పెంపొందించే చిట్కాలు ;

1. అర టీ స్పూన్ బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీనిని నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

2. ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.

3. రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తే.. చర్మం మెరుగ్గా తయారవుతుంది. పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌‌ప్యాక్ వేస్తే ముఖానికి మంచి ఛాయ, నిగారింపు సంతరించుకుంటుంది.

4. ఒక టీ స్పూన్ బాదంనూనె, చక్కెర తీసుకుని కలపాలి. దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాలపాటు రుద్దాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగాలి. ఇలా చేయడం వల్ల దీనివల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది.

5. రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగాలి. ఇలా చేస్తే నలుపు రంగుపోయి, తెల్లగా నిఘారింపుతో చర్మం మెరిసిపోతుంది.