Aloe vera : జిడ్డు చర్మానికి కలబంద

కలబంద జెల్‌ను బౌల్ లో తీసుకుని ..  ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. బాగా గడ్డ కట్టిన తర్వాత ఆ ఐస్ క్యూబ్స్‌ను ఒక పల్చటి కాటన్ క్లాత్‌లో వేసి.. ముఖంపై అద్దుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల జిడ్డును తొలగించి.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. అలాగే ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.. ముఖం కాంతివంతంగా మారుతుంది.

Aloe vera : జిడ్డు చర్మానికి కలబంద

Alove Vera

Aloe vera : ఎండల కారణంగా ముఖం, శరీరంలోని వివిధ భాగాలలో చర్మం జిడ్డుగా మారిపోతుంది. చాలా మంది ఈ సమస్యతో సతమతమౌతుంటారు. కొంత మందిలో చర్మం ఎప్పుడూ జిడ్డుగా కనిపిస్తుంటుంది. జిడ్డు చర్మం చాలా చిన్న సమస్యగా కొందరు బావిస్తారు. జిడ్డు చర్మం గలవారు వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖం కడుకున్న కొద్ది క్షణాల్లో చర్మం జిడ్డుగారుతూ కనిపిస్తుంది. చర్మం జిడ్డుగా ఉంటే.. మొటిమల సమస్య అధికంగా ఉంటుంది.

జిడ్డు చర్మాన్ని నివారించడంలో కలబంద గ్రేట్‌గా సహాయపడతుంది. కలబంద చర్మంలో మెలనిన్ మొత్తాన్ని తగ్గించడంతో పాటు పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. కలబంద జెల్ ను రోజూ పూయడం ద్వారా చర్మం క్రమంగా మెరుగవుతుంది.

ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కలబంద గుజ్జు మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత చల్లటి నీటితో ఫేస్‌ వాష్ చేసుకోవాలి. ఇలా డే బై డే చేస్తూ ఉంటే.. కలబందలో అధికంగా ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు.. చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను పీల్చేస్తుంది. ఫలితంగా ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.

కలబంద జెల్‌ను బౌల్ లో తీసుకుని ..  ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. బాగా గడ్డ కట్టిన తర్వాత ఆ ఐస్ క్యూబ్స్‌ను ఒక పల్చటి కాటన్ క్లాత్‌లో వేసి.. ముఖంపై అద్దుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల జిడ్డును తొలగించి.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. అలాగే ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.. ముఖం కాంతివంతంగా మారుతుంది. కలబందలో గ్లిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ మొదలైనవి వంటి అనేక పోషకాలతో కలిగి ఉంటుంది ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది

ఒక బౌల్‌లో కలబంద గుజ్జు, నిమ్మరసం, శెనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆతరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.. ముఖంలో జిడ్డు తగ్గి మొఖం కాంతివంతంగా మారుతుంది.

కలబంద మరియు ఆలివ్ నూనెతో తయారు చేసిన తేమ ప్యాక్ మీ చర్మం నీ సున్నితంగా మృదువుగా చేసి ముడతలను పోగొడుతుంది. కలబంద ఆకుల్లో ముళ్ల కొసలను కత్తిరించి మిగతా ఆకును ముక్కలుగా కోసి నీళ్లలో ఉడికించి గుజ్జలా చేయాలి. ఈ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మంపై జిడ్డు పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది.