Home Plants : ఆక్సిజన్ తోపాటు , వాస్తు దోషాలు తొలగిపోవాలంటే మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్కలు ఇవే!

కొన్ని మొక్కలు వాస్తుకు చాలా అనుకూలంగా ఉండటంతోపాటు, గాలిని శుద్ది చేయటంలో సహాయపడతాయి. చాలా మంది ఇలాంటి మొక్కలను తమ ఇంట్లో పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Home Plants : ఆక్సిజన్ తోపాటు , వాస్తు దోషాలు తొలగిపోవాలంటే మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్కలు ఇవే!

Along with oxygen, these are the plants you must have in your home to get rid of Vastu Dosha!

Home Plants : పచ్చని మొక్కలు, చెట్లు అవి ఉండే ఇళ్లకు అందాన్ని, సొబగులను చేకూర్చడంతోపాటు మనం పీల్చే గాలిని శుభ్రపరచడంలో కూడా సహాయపడతాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే, కొన్ని మొక్కలు వాస్తుకు చాలా అనుకూలంగా ఉండటంతోపాటు, గాలిని శుద్ది చేయటంలో సహాయపడతాయి. చాలా మంది ఇలాంటి మొక్కలను తమ ఇంట్లో పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి నీరు కొద్ది మోతాదులో మాత్రమే అవసరమౌతుంది.

1. తులసి ; పవిత్ర తులసి మొక్క పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని నాటడానికి ఉత్తమమైన ప్రదేశం ఉత్తరం లేదా తూర్పు కలయిక ప్రదేశం ఈశాన్య దిశ. వీటిని చిన్న చిన్న కుండీల్లో కాకుండా కాస్త పెద్ద కుండీల్లో పెంచడండి. లేదంటే అవి త్వరగా ఎండిపోతాయి. తులసి మొక్క వేరు విస్తరించాలి. అప్పుడే అది ఆరోగ్యకరంగా పెరుగుతుంది. రోజుకు రెండు సార్లు నీరు పోయండి. తులసి చెట్టు ఇంటి వాతావరణాన్ని శుధ్ది చేస్తుంది. సూక్ష్మ క్రిముల బరి నుంచి ఇంటిని దూరంగా ఉంచుతుంది. తులసి ఒక ఔషధ మొక్క. దీని ఆకులు రక్తం నుండి విషాన్ని తొలగించడం ద్వారా జీర్ణ మరియు ప్రసరణ వ్యవస్థను శుద్ధి చేస్తాయి.

2. లక్కీ వెదురు మొక్క ; లక్కీ వెదురు ఇంట్లో ఉంటే అదృష్టం, శాంతిని కలిగిస్తుంది. అంతేకాకుండా సంపద మరియు కీర్తిని తెస్తుంది. సాధారణ వెదురు మొక్కలా కాకుండా దానికి భిన్నంగా ఉంటుంది. ఇది ఒక మరగుజ్జు వెదురు మొక్క. ఈ మొక్కను ఎంపిక చేసుకునే సమయంలో ముదురు రంగు వెదురు బెరడు కంటే పసుపు రంగు బెరడుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంటి కోసం ఎక్కువగా ఉపయోగించే లక్కీ ప్లాంట్లలో ఇది ఒకటి.

3. బ్రహ్మీ ; ప్రతీ ఇంట్లో బ్రహ్మీ చెట్టు ఉండాలి అని పూర్వికులు చెబుతుంటారు. మాససిక ఆరోగ్యం కోసం బ్రహ్మీ చెట్టు చాలా ముఖ్యమైనది. ఇది ప్రతి కూల ఆలోచనలు అంటే నెగెటివ్ థాట్స్ ను తొలగిస్తుంది. ఇందులో ఎన్నో గుణాలు ఉంటాయి. ఇది పిల్లల్లో హైపర్ టెన్షన్ ను దూరం చేస్తుంది. దాంతో పాటు నర్వస్ సిస్టమ్ కు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. ఎముకలను పటిష్టం చేస్తుంది. దాంతో పాటు మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. బ్రహ్మీ చెట్టుతో మీరు కషాయం చేసుకుని తాగవచ్చు. అందంగా కనిపించే మొక్కల కన్నా బ్రహ్మీ చెట్టును ఇంట్లో పెంచటం చాలా మంచిది.

4. బిల్వపత్రి చెట్టు ; బిల్వపత్రి చెట్టు ఆకులు, వేరు, పండ్లు అన్ని పవిత్రమైనవి. బిల్వ చెట్టు భూమిని చల్లబరుస్తుంది. పరమశివునికి ఈఆకులతో పూజ చేస్తారు. బిల్వ పత్రి చెట్టు సంవత్సరానికి 56 టన్నుల ఆక్సిజన్ ను విడుదల చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

5. మనీ ప్లాంట్ ; మనీ ప్లాంట్ వాస్తు శాస్త్ర ఆచరణలో ఉపయోగించే ప్రసిద్ధ మొక్కలు మరియు చెట్లలో ఒకటి. వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ ఇంటి యజమానులకు సంపద మరియు శ్రేయస్సును తెస్తుంది. ఇది ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టాలి. ఇళ్లలోని మనీ ప్లాంట్‌లను ఇండోర్‌లో, బెడ్‌రూమ్‌లలో కూడా ఉంచవచ్చు కానీ బెడ్‌ల హెడ్‌రెస్ట్ లేదా ఫుట్‌రెస్ట్ దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. మనీ ప్లాంట్లను బాల్కనీలలో ఉంచడం చాలా అదృష్టమని భావిస్తారు, అయితే దీనిని బాల్కనీకి ఈశాన్య భాగంలో ఉంచాలి. డబ్బు కోసం సాధారణంగా ఉపయోగించే వాస్తు మొక్కలలో ఇది ఒకటి.