Corn For Health : చర్మ ఆరోగ్యంతోపాటు, రక్త ప్రసరణ మెరుగు పరిచే మొక్కజొన్న!

మొక్కజొన్నలో బీటా కెరోటిన్‌ ఎక్కువ. విటమిన్‌ ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్‌ ఏతో పాటు మొక్కజొన్నలో విటమిన్‌ బీ, సీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్‌ బి కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్‌ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్ వంటి జీవక్రియలు సక్రమంగా సాగడంలో తోడ్పడతాయి.

Corn For Health : చర్మ ఆరోగ్యంతోపాటు, రక్త ప్రసరణ మెరుగు పరిచే మొక్కజొన్న!

corn improves blood circulation

Corn For Health : మొక్కజొన్నలో పీచు పదార్థం పుష్కలం. ఆహారం జీర్ణమవడంలో ఉపకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తులను తినేందుకు అంతా ఇష్టపడుతుంటారు. మరి కొంతమంది మొక్కజొన్నను ఉడకబెట్టుకుని తినేందుకు ఇష్టపడతారు. అందరికీ అందుబాటు ధరలో ఉండే మొక్కజొన్నను టైమ్‌పాస్‌ ఫుడ్‌గా భావించనప్పటికీ దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మొక్కజొన్నలో బీటా కెరోటిన్‌ ఎక్కువ. విటమిన్‌ ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్‌ ఏతో పాటు మొక్కజొన్నలో విటమిన్‌ బీ, సీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్‌ బి కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్‌ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్ వంటి జీవక్రియలు సక్రమంగా సాగడంలో తోడ్పడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నలో విటమిన్‌ బీ12,ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్ అధికం. శరీరంలో ఎర్రరక్త కణాల ఉ‍త్పత్తిని పెంచడంలో ఇవి తోడ్పడతాయి. రక్త హీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతులకు మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఇది దోహదపడుతుంది.

మొక్కజొన్నలో ఫెలురిక్‌ యాసిడ్‌ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దీనికి ఉంది. గాయమైనపుడు కలిగే ఇన్‌ఫ్లమేషన్‌ వాపు, మంట, నొప్పిను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. మొక్కజొన్నలో విటమిన్‌ సీతో పాటు లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ అధికం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే కార్న్‌ ఆయిల్‌, కార్న్‌ స్టార్చ్‌ను పలు సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడతారు. బరువు పెరగాలనుకుంటున్న వారు మొక్కజొన్న తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక కప్పు పచ్చి మొక్కజొన్న గింజల్లో 125 కాలరీలు ఉంటాయి. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు.. 4 గ్రాముల ప్రొటిన్లు, 9 గ్రాముల షుగర్‌, 2 గ్రాముల ఫ్యాట్‌,75 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటుంది. మొక్కజొన్నను మధుమేహులు మితంగా తీసుకోవటం మంచిది.