Benefits Of Sesame For Skin : చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే నువ్వులు !

నువ్వుల నూనె చర్మాన్ని మృధువుగా మార్చటంతోపాటు, చర్మంపై టోన్ ను తొలగించటంలో సహాయపడుతుంది. చర్మంపై రంధ్రాలు మూసుకుపోకుండా తెరచుకుని ఉండాలంటే వారానికి ఒకసారి చర్మాన్ని నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవటం మంచిది.

Benefits Of Sesame For Skin : చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే నువ్వులు !

sesame seeds

Benefits Of Sesame For Skin : నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి నువ్వుల గింజలతో తయారైన నూనె బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది.

నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం చూపుతాయని ఆయుర్వేదం చెబుతుంది.

READ ALSO : Sesame Seeds : చలికాలంలో శరీరం వేడిగా ఉంచటంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే నువ్వులు!

నువ్వుల నూనెతో ముఖానికి మసాజ్ చేస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మొటిమలు , మచ్చలు వంటివి తొలగిపోతాయి. నువ్వుల నూనతో చర్మంపై మసాజ్ చేసుకున్న తరువాత గోరువెచ్చని నీరు లేదా రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. నువ్వుల నూనె చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చటంతోపాటు, ముఖాన్ని తాజాగా మార్చటంలో తోడ్పడుతుంది.

నువ్వుల నూనె చర్మాన్ని మృధువుగా మార్చటంతోపాటు, చర్మంపై టోన్ ను తొలగించటంలో సహాయపడుతుంది. చర్మంపై రంధ్రాలు మూసుకుపోకుండా తెరచుకుని ఉండాలంటే వారానికి ఒకసారి చర్మాన్ని నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవటం మంచిది. ఇలా చేస్తే చర్మంపై ఉండే దుమ్ము, దూళి వంటివాటిని తొలగించుకోవచ్చు. గోరు వెచ్చని నువ్వుల నూనెతో ముఖంపై మసాజ్ చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు.

READ ALSO : Health : బెల్లంతో కలిపి నువ్వులు రోజు తింటే?…

నువ్వులనూనెలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయటంతోపాటు ఈ గింజల్లో ఉండే పోషక అంశాలు కాల్షియం, ఐరన్ వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి.

నువ్వుల నూనెలో విటమిన్ A మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి. ఈ కారణంగా ఈ నూనెకు ఇంత ప్రాముఖ్యత ఉంది. ఈ నూనెను వేడి చేసి చర్మంపై మసాజ్ చేయడం వల్ల చర్మము నిగారింపు పొందుతుంది. జుట్టు మీద పూస్తే వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.