Chikki : చక్కని ఫలారం, చిక్కీలతో అస్తమా, ఎసిడిటీకి చెక్

శీతల ప్రాంతాల్లో శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి బాగా పనికొస్తాయంటున్నారు. పండుగల సందర్భంగా..బెల్లం, నువ్వులతో పిండి వంటలు తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. పల్లీలు. వీటితో చిక్కీలు తయారు చేస్తుంటారు. పల్లీలు, నువ్వులే కాకుండా..ఇందులో పుట్నాలు, మరమరాలతో చిక్కీలు చేస్తారు. బాదం, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు.

Chikki : చక్కని ఫలారం, చిక్కీలతో అస్తమా, ఎసిడిటీకి చెక్

Chikki

Amazing Health Benefits : మధుమేహం, అస్తమాతో బాధ పడేవారు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అస్తమా అనేది శ్వాసకోశ వ్యాధి. ఎసిడిటీలతో ఉన్న వారు అవి తినకూడదు..ఇవి తినకూడదని అంటుంటారు. దీంతో వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే..ఎసిడిటీ వంటి జీర్ణకోశ వ్యాధులతో బాధపడే వారికి బెల్లం మంచి ఔషధం అంటున్నారు. బెల్లం, నువ్వులు కలిపి తింటే..మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. నువ్వులను బెల్లంతో కలిపి తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది.

Read More : Varalaxmi Sarathkumar: బచ్చన్ ఫ్యామిలీతో ‘జయమ్మ’.. పిక్స్ వైరల్!

శీతల ప్రాంతాల్లో శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి బాగా పనికొస్తాయంటున్నారు. పండుగల సందర్భంగా..బెల్లం, నువ్వులతో పిండి వంటలు తయారు చేస్తారనే సంగతి తెలిసిందే.
పల్లీలు. వీటితో చిక్కీలు తయారు చేస్తుంటారు. పల్లీలు, నువ్వులే కాకుండా..ఇందులో పుట్నాలు, మరమరాలతో చిక్కీలు చేస్తారు. బాదం, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు. సూపర్ మార్కట్ మొదలుకుని..చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో ఈ చిక్కీలు కనిపిస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వీటిని పట్టీలు కూడా అంటుంటారు. పల్లీలు, నవ్వులు బాగా వేయించి..బెల్లం పాకం పట్టి, పట్టీలు లేదా లడ్డూలు చేస్తుంటారు.

Read More : Tiruamala Seva Tickets : శ్రీవారి సేవా టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిపై కేసు

ఇక పల్లీలు, నవ్వులు, డ్రై ఫ్రూట్స్ లో ప్రొటీన్లతో పాటు…కొవ్వు శాతం ఎక్కువగానే ఉంటుంది. వీటిని బెల్లంతో తయారు చేసినప్పుడు..పోషకాలు రెట్టింపు అవుతాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయి. వ్యాయామం చేసే వారికి ఇది చక్కని ఆహారంగా చెప్పవచ్చు.

Read More : రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

మరీ ఈ చిక్కీలు ఎలా చేసుకోవాలి :-

ముందుగా గింజలను నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఉపయోగిస్తే.. వేయించుకున్న అనంతరం వీటి పొట్టు తీసేయాలి. గింజల కొలతకు సగం బెల్లం తీసుకుని…తీగపాకం పట్టుకోవాలి. అందులో వేయించుకున్న గింజలు వేసి వెంటనే నూనె రాసిన..పల్లెంలో వేసుకోవాలి. ఏ సైజులో కావాలని అనుంటే ఆ సైజ్ ను కట్ చేయాలి. అనంతరం చల్లారిన తర్వాత…ముక్కలు ఈజీగా బయటకు వస్తాయి.