Amla Honey Jam : కాలేయానికి మేలు చేసే ఉసిరి తేనె జామ్

అధిక బరువు ఉన్నవారికీ ఈ మిశ్రమం తీసుకుంటే బరువు తగ్గేలా చేస్తుంది. శరీరంలోని కొవ్వు కరిగేలా చేయడంతో బరువు తగ్గుతారు.

Amla Honey Jam : కాలేయానికి మేలు చేసే ఉసిరి తేనె జామ్

Amla

Amla Honey Jam : ఉసిరికాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన కాయల్లో ఉసిరికాయ ఒకటి. చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఆయుర్వేద వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు కూడా రోజూ ఒక ఉసిరికాయ తినమని ఒత్తిడి తెస్తున్నారంటే ఇది ఎంత ఆరోగ్యకరమో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ ఉసిరిని తేనెతో కలిపి తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

తేనెలో నానబెట్టిన ఉసిరిని తింటే నివారించుకోవచ్చు. తేనె, ఉసిరికాయతో కలిపి జామ్ ను తయారు చేసుకుని పరగడుపున తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రాతి ఉసిరికాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. తర్వాత ఒక గాజు సీసా తీసుకుని అందులో సగం నిండేవరకూ తేనేతో నింపాలి. ఇప్పుడు కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలను తీసుకుని చిన్న చిన్న గాటు పెట్టి.. ఆ తేనెలో వేయాలి. తడి తగలకుండా గాజు సీసా మూత పెట్టి.. ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొన్ని రోజులు కదపకుండా ఉంచేస్తే.. ఉసిరికాయతేనె జామ్ తయారవుతుంది. రోజు పరగడుపున తేనెతో కలిసి ఒక ఉసిరికాయను తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం…

ఉసిరి,తేనె జామ్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

ఇలా తేనె ,ఉసిరికాయ తినడం వలన కాలేయంలో వ్యర్ధాలు బయటకు పంపి, లివర్ పనితీరు మెరుగుపరుస్తుంది. కాలేయం సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా కామెర్ల వ్యాధిబారిన పడివారికి మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. మహిళలోని రుతు సమస్యలను తీరుస్తుంది. రుతుక్రమం రెగ్యులర్ అవుతుంది. ఉసిరి, తేనే మిశ్రమం మగవారిలో లైంగిక శక్తిని పెంపొందిస్తుంది, వీర్య నాణ్యత పెరిగి సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి.

చలికాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది. దీంతో తిన్నది ఏదైనా జీర్ణం సరిగా కాదు. అయితే ఈ తేనె, ఉసిరి జామ్ తినడంవలన జీర్ణ శక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం జీర్ణమవుతుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ సమస్యలతో ఇబ్బందిపడేవారికి ఈ మిశ్రమం మంచి ఔషధంగా పనిచేస్తుంది. చర్మం మీద ముడతలు నివారిస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు, ముడతలు తగ్గుతాయి. ఆస్తమాతో ఇబ్బంది పడేవారు శ్వాసను సరిగా తీసుకోలేరు. అలాంటివారికి ఇది బాగా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమం రోజూ తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్వాసపరమైన సమస్యలు తగ్గుతాయి.

అధిక బరువు ఉన్నవారికీ ఈ మిశ్రమం తీసుకుంటే బరువు తగ్గేలా చేస్తుంది. శరీరంలోని కొవ్వు కరిగేలా చేయడంతో బరువు తగ్గుతారు. ఆకలి పెరిగేలా చేస్తుంది. మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం చేకూరుస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తం శుద్ధి జరగటంతోపాటు గుండె జబ్బులను నివారిస్తుంది. జుట్టు సమస్యలు పోతాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.