Apple : జీర్ణసమస్యలకు చెక్ పెట్టే ఆపిల్ పండు

ఆపిల్ పండ్ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయ‌ని సైంటిస్టు‌లు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

Apple : జీర్ణసమస్యలకు చెక్ పెట్టే ఆపిల్ పండు

Apple (1)

Apple : ప్రతిరోజు ఒక ఆపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రమే రాదన్న విషయాన్ని అందరూ చెప్తుంటారు. వాస్తవానికి ఇది నిజమే…అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారికి పండ్లు తీసుకెళ్లే వారు ఎవ‌రైనా స‌రే మొద‌ట‌గా యాపిల్స్‌కే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. యాపిల్ పండ్ల‌లో నిజంగానే ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ పండ్ల‌లో గుండెకు మేలు చేసే అంశాలు మ‌రిన్ని ఉన్నాయి.

ఆపిల్ పండ్లు మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఇవి మ‌న ఆక‌లి తీర్చ‌డ‌మే కాదు.. మ‌రోవైపు మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను కూడా అందిస్తాయి. అధిక బ‌రువు త‌గ్గేందుకు, గుండె ఆరోగ్యానికి ఆపిల్స్ మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫోలేట్‌, బీటా కెరోటీన్‌, విట‌మిన్ కె త‌దిత‌ర పోష‌కాలు మ‌న శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి. ఆపిల్ పండ్ల వ‌ల్ల జీర్ణ‌స‌మ‌స్య‌లు పోతాయి.

యాపిల్ పండ్ల‌లో మొక్క‌ల‌కు సంబంధించిన ర‌సాయ‌నాలు, ఫ్లేవ‌నాయిడ్లు, పీచు అధికంగా ఉంటాయి. యాపిల్ పండ్ల‌ను తొక్క‌తీయకుండానే తినాలి. తొక్క తీసి తింటే ఫ్లేవ‌నాయిడ్లు, పీచు శరీరానికి అందకుండా పోతుంది. క‌నుక యాపిల్ పండ్ల‌ను తొక్క‌తోపాటు తినాల్సి ఉంటుంది. యాపిల్ పండ్ల‌లో పాలిఫినాల్స్, ఫ్లేవ‌నాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల యాపిల్ పండ్లు గుండె ఆరోగ్యానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

నిత్యం మ‌నం పాటించే ఆహార‌పు అల‌వాట్లు, అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న‌శైలి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల అనేక మందికి జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌స్య‌లు ఇత‌ర అనారోగ్యాల‌కు కూడా కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో మొత్తం మీద ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. అయితే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటే.. దాదాపుగా ఇత‌ర అనారోగ్యాలు కూడా రాకుండా చూసుకోవ‌చ్చు. అందుకు గాను ఆపిల్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. నిత్యం ఆపిల్ పండ్ల‌ను తింటే వాటిలో ఉండే పీచు ప‌దార్థం జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం ఏర్ప‌డ‌కుండా.. సాఫీగా విరేచ‌నం అయ్యేలా చూస్తుంది.

మ‌న శ‌రీరంలోని జీర్ణాశ‌యంలో ఉండే మంచి బాక్టీరియాకు ఆపిల్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. దీని వ‌ల్ల మ‌నం తినే ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. దీంతో జీర్ణాశ‌యం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఆపిల్ పండ్ల‌ను రోజులో ఎప్పుడైనా తీసుకోవ‌చ్చు. భోజ‌నానికి, భోజ‌నానికి మ‌ధ్య స్నాక్స్ రూపంలో వీటిని తింటే ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంది. వేస‌విలో ఇత‌ర కూర‌గాయ‌లు, పండ్ల‌తో క‌లిపి ఆపిల్స్‌ను స‌లాడ్ రూపంలో తీసుకోవ‌చ్చు.

ఆపిల్ పండ్ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయ‌ని సైంటిస్టు‌లు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. దీంతోపాటు డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. ఆపిల్ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎముక‌లను దృఢంగా మారుస్తాయి. వీటిలోని ఫైబ‌ర్ అధిక బ‌రువును తగ్గించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. యాపిల్ పండ్ల‌లో కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే శ‌క్తి సైతం ఉంది. మ‌న శ‌రీర క‌ణాలు ఆక్సిడేష‌న్ అనే ప్ర‌క్రియ‌కు గురి కాకుండా కూడా యాపిల్ కాపాడుతుంది.

యాపిల్ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. యాపిల్ పండ్ల‌లో విటమిన్ సి, ఫైబ‌ర్ ఉంటాయి క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే మేలు చేస్తాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఎలాంటి ఆందోళ‌న చెంద‌కుండా రోజుకు 1 యాపిల్ పండును నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు.