Weight Loss : బరువు తగ్గించే ఇంగువ వాటర్

ఇంగువలో రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే పదార్థాలు ఉన్నాయి. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇంగువ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర

10TV Telugu News

Weight Loss : భారతీయ  వంటకాలకు రుచి, అద్భుతమైన వాసనను తీసుకురావడానికి వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తారు. వాటిలో ఇంగువ కూడా ఒకటి. ఇంగువలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. అవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కడుపుని శుభ్రం చేసే సాధనాలలో ఇది చాలా ముఖ్యమైనది. అలాగే ప్రేవుల్లో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. నరాల బలానికి వాడుతారు. మంచి జీర్ణకారి. నిద్రని పుట్టించే గుణం కూడా దీనిలో ఉంది. అయితే వంటకాలలో ఇంగువను వాడడమే కాకుండా ఇంగువ నీరు కూడా తాగొచ్చు. చిటికెడు ఇంగువను నీటితో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ఇంగువ వాటర్ జీవక్రియను పెంచడంలో సహాయ పడుతుంది. ఇంగువ వాటర్ తాగడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవడంలో ఇంగువ సహాయ పడుతుంది. ఇంగువను తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ నుండి హానికరమైన విషపదార్థాలన్నింటినీ బయటకు పంపించేస్తుంది. శీతాకాలంలో చాలా త్వరగా జలుబు బారిన పడే వ్యక్తి అయితే ఇంగువ నీటిని తాగండి. ఇది శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. చలి నుండి రక్షిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని దానికి 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసి ఖాళీ కడుపుతో తాగండి.

ఇంగువలో రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే పదార్థాలు ఉన్నాయి. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇంగువ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో మీకు సహాయ పడుతుంది. గర్భనిరోధకంగా ఇది వాడుకలో ఉంది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఇంగువ ముఖ్యమైన పదార్థం. లైంగిక పటుత్వం తగ్గినవారిలో ఇంగువని వాడుకోవచ్చు. మర్రిపాలలో తేనెని కలిపి కొద్ది ఇంగువని కలిపి తీసుకుంటే 40 రోజులలో మంచి గుణం కనిపిస్తుంది.

ఇంగువ వాడకం మోతాదుకు మించితే కొన్ని దుష్ఫ్రభావాలు కూడా ఉన్నాయి. ఇంగువ ఎక్కవగా వాడితే పెదవుల వాపు సమస్య తలెత్తుతుంది. చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అధికంగా వినియోగించటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడేవారు ఇంగువను తీసుకోకపోవటమే మంచిది. ఇంగువ తీసుకునే విషయంలో వైద్యుల సూచనలు సలహాలు పాటించాలి.