Anti-Ageing Diet: వయస్సును తగ్గించే ఆరు ఆహార పదార్థాలు

వయస్సును బట్టి చర్మంలో మార్పులు సహజం. ఒక వయస్సు వరకూ బాగానే అనిపించే చర్మం 30దాటాక మన మాట వినదు. వయస్సుతో పాటు ముడతలు రావడం, మెరుపు తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. వీటిని అధిగమించడానికి యాంటీ యేజింగ్ డైట్ వాడొచ్చట.

Anti-Ageing Diet: వయస్సును తగ్గించే ఆరు ఆహార పదార్థాలు

Skin Ageing

 

Anti-Ageing Diet: వయస్సును బట్టి చర్మంలో మార్పులు సహజం. ఒక వయస్సు వరకూ బాగానే అనిపించే చర్మం 30దాటాక మన మాట వినదు. వయస్సుతో పాటు ముడతలు రావడం, మెరుపు తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. వీటిని అధిగమించడానికి యాంటీ యేజింగ్ డైట్ వాడొచ్చట. ఎక్కువ న్యూట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ఉండే ఆహారమైతే చాలా బెటర్ అంటున్నారు.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ 6 యాంటీ ఏజింగ్ ఫుడ్ ఐటెంలు ఫాలో అవండి.

Nuts: పప్పు ధాన్యాలు.. శాచురేటెడ్ కానీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రొటీన్ ఉండే పప్పు ధాన్యాలు తినండి. బాదంపప్పులు, జీడి పప్పు, వాల్నట్స్, పీనట్స్ డైట్ లో చేర్చుకోండి.

Water: నీరు తాగడం వల్ల మీకు దాహం తీరడమే కాకుండా వయస్సును కూడా తగ్గిస్తుంది. శరీరం నీటి శాతం తగ్గిపోయినప్పుడు ఆయిల్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. దాదాపు ఆరోగ్యం కాపాడుకోవడానికి నీరు తాగితే చాలని నిపుణులు అంటున్నారు.

Broccoli: బ్రకోలీలో న్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. వాటితో పాటు విటమిన్ సీ తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచే కొలాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది.

Red Wine: రెడ్ వైన్ తీసుకోవడం చాలా మందికి ఇష్టముండకపోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ను కట్టడి చేసి రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. మహిళలు ఒక్కసారి, పురుషులు రెండుసార్లు తీసుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు.

Papaya: ముడతలు లేని చర్మం కోసం పొప్పాయ తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. చర్మం కాంతివంతంగా మారడానికి సహకరిస్తాయి. అంతేకాకుండా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి.

Others: వీటితో పాటు దానిమ్మ, బ్లూబెర్రీ, స్వీట్ పొటాటో, ఆవకాడో లాంటి ఇతర ఫ్రూట్స్ రోజూ ఆహారంలో తీసుకుంటూ మంచి ఫిజిక్ మెయిన్టైన్ చేయాలి.

డార్క్ చాకొలేట్-రిచ్ ఫుడ్స్ లో షుగర్ కంటెంట్ కాస్త తక్కువగా ఉంటుంది. వాటిల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బచ్చలకూర లాంటి ఆకుకూరలు బరువు తగ్గడానికి, కాంతివంతమైన చర్మానికి సహకరిస్తాయి.