Healthy kidneys : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా, రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు నివారించాలన్నా ఆహారంలో మార్పులు తప్పనిసరి?

శరీరంలోని అదిక శాతం నీటిని తొలగించడంలో సహయపడతాయి. అధిక రక్తపోటు, మధుమేహం ఉంటే కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. ఈ వ్యాధులు నియంత్రణలో లేకపోతే కిడ్నీలపై పనితీరుపై ప్రభావం చూపుతుంది.

Healthy kidneys : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా, రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు నివారించాలన్నా ఆహారంలో మార్పులు తప్పనిసరి?

Are changes in diet necessary to keep kidneys healthy and prevent problems like stone formation?

Healthy kidneys : శరీరంలో అతి ముఖ్యమైన విధులను నిర్వహించడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరంలోని విష ద్రవ పదార్థాలను తీసేయ్యటంలో కిడ్నీలు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడమే కాకుండా. శరీరంలోని అదిక శాతం నీటిని తొలగించడంలో సహయపడతాయి. అధిక రక్తపోటు, మధుమేహం ఉంటే కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. ఈ వ్యాధులు నియంత్రణలో లేకపోతే కిడ్నీలపై పనితీరుపై ప్రభావం చూపుతుంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కిడ్నీలు దెబ్బతింటాయి.

కిడ్నీ చెడిపోతే శరీరంలో గుండె సంబంధిత వ్యాధులు కూడా మొదలవుతాయి. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంల సహాయపడతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కిడ్నీల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారాలు ;

1. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే, సోడియం, కొలెస్ట్రాల్, కొవ్వు వంటి వాటిని ఆహారంలో తక్కువగా చేర్చాలి. బదులుగా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, సీఫుడ్, గుడ్లు, చికెన్, గింజలు, చిక్కుళ్ళు, విత్తనాలు, సోయా ఉత్పత్తులు మొదలైనవి పుష్కలంగా తినాలి. ఇప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

2. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, ఆకు కూరలు వంటివి రోజువారీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. లేదా కనీసం వారానికి 4 రోజులైనా ఉండాలి. ఇక తినే ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి. అలాగని పూర్తిగా మానకూడదు. కూరల్లో ఉప్పు వేస్తే పెరుగులో ఉప్పు మానడం ఇలా వీలైన చోట ఉప్పు తగ్గించేయాలి.

3. మద్యం సేవించడం మానేయండి. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్, హై ప్రొటీన్ డైట్, ఫైబర్ రిచ్ కార్బోహైడ్రేట్స్, హై షుగర్ ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడానికి బదులుగా, ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు తీసుకోండి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వాటిలో లెమన్ సాల్ట్, ఇతరత్రా వినియోగం వల్ల చాలా ప్రమాదం. కాబట్టి, జంక్ ఫుడ్‌ను వదిలేయాలి. శరీరంలో మెగ్నీషియం పెంచుకోవాలి. క్యాల్షియం ఆక్సోలేట్ అనేది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది.

4. విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లు, దోసకాయ, దోసకాయ, పుచ్చకాయ, సీతాఫలం మొదలైన నీటిలో అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తినండి. మాంసం, పోర్క్, చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువకుతుంది. దీన్ని కంట్రోల్‌లో ఉంచాలి. కాబట్టి వీటిని కూడా పరిమితంగానే తీసుకోండి. ఫాస్పేట్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

5. రోజుకు కనీసం 12 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. జ్యూసులు కూడా రెగ్యులర్‌గా తాగుతూ ఉండాలి. పంచదార సాధ్యమైనంతవరకూ మానేయడం మంచిది. పంచదార స్థానంలో తప్పని పరిస్థితుల్లో బెల్లం వాడితే మంచిది. రక్తంలో నుండి చెడు పదార్థాలను తొలగించడానికి నీళ్ళు బాగా సహాయపడుతాయి. అలానే కిడ్నీలో రాళ్ళు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూసుకుంటుంది. ఓవర్ హైడ్రేషన్ వల్ల కూడా సమస్యలు వస్తాయి.