diabetics skipping meals : మధుమేహులు మద్యం సేవించాక భోజనం చేయటం మానేస్తున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే!

మధుమేహులు మద్యం అలవాటు ఉన్నట్లైతే మద్యం సేవించాక తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. చాలా మంది మద్యం సేవించిన తరువాత ఆహారం తీసుకోకుండా షుగర్ కు సంబంధించిన మందులను వేసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజ్ మోతాదులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.

diabetics skipping meals : మధుమేహులు మద్యం సేవించాక భోజనం చేయటం మానేస్తున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే!

చాలా మంది రోజులో భోజనం మానేయటం అన్నది ఇటీవలి కాలంలో సర్వసాధారమై పోయింది. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు భోజనం మానేయటం వల్ల రక్తంలో చక్కెర స్ధాయిలు ప్రమాదకరంగా తగ్గటం లేదా, అధికం కావటం వంటివి చోటు చేసుకుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి మందులు తీసుకునే వారు భోజనం మానేయటం వల్ల ఆప్రభావం శరీరంపై పడుతుంది.

రోజుకు కనీసం మూడు పూటల భోజనంతో మన శరీరానికి ఇంధనం అందించడం మధుమేహం ,బరువు నిర్వహణలో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు భోజనం తీసుకోకపోవటం వల్ల రక్తంలో చక్కెరలు చాలా తక్కువగా ఉంటాయి. ఇదిలా వుంటే
మధుమేహంతో బాధపడుతూ మద్యం తాగే అలవాటు ఉన్నవారు మద్యం సేవించిన తరువాత భోజనం మానేస్తుంటారు. ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మధుమేహం ఉన్నవారు మద్యం తాగటం అన్నది సమస్య తీవ్రతను మరింత పెంచటమే అవుతుంది. మద్యం మధుమేహుల్లో నాడీ వ్యవస్ధను దెబ్బతీస్తాయి.

మధుమేహులు మద్యం అలవాటు ఉన్నట్లైతే మద్యం సేవించాక తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. చాలా మంది మద్యం సేవించిన తరువాత ఆహారం తీసుకోకుండా షుగర్ కు సంబంధించిన మందులను వేసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజ్ మోతాదులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. మద్యం సేవించాక భోజనం మానేయటం వల్ల గ్లూకోజు ఉత్పత్తి ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. దీంతో షుగర్ నిల్వలు పడిపోతాయి. చివరకు హైపోగ్లైసీమియాకు దారి తీస్తుంది.

మధుమేహం ఉన్నవారు మద్యం సేవించటం వల్ల రక్తంలో చక్కెర ప్రతిచర్యలకు దారితీస్తుంది. సాధారణంగా రక్తంలో చక్కెర స్ధాయిలను నిర్వహించటానికి కాలేయం గ్లూకోజ్ ను విడుదల చేస్తుంది. అయితే ఆల్కాహాల్ తాగిన సందర్భంలో కాలేయం ఆల్కాహాల్ ను విచ్ఛిన్నం చేయటంలో నిమగ్నమై ఉండటం వల్ల రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ ను విడుదల చేయటంలో నెమ్మదిస్తుంది. ఆల్కాహాల్ తీసుకున్న తరువాత భోజనం చేయని వారిలో రక్తంలో చక్కెర స్ధాయిలు తగ్గే ప్రమాదం ఉంటుంది.