Potatoes : మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలు తినడం సురక్షితమేనా?

ఒక చిన్న బంగాళాదుంపలో 30 గ్రాముల పిండి పదార్థాలు మరియు పెద్ద బంగాళదుంపలో సుమారు 65 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. అయితే, బంగాళాదుంపలను ఆహారంగా తీసుకునే విధానాన్ని బట్టి సంఖ్య మారుతుంది. అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవడం నియంత్రించడానికి, ఉడికించిన, కాల్చిన, వేపిన బంగాళాదుంపలను తీసుకోవటం బెటర్.

Potatoes : మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలు తినడం సురక్షితమేనా?

Are potatoes safe for diabetics to eat?

Potatoes : మధుమేహం బారిన పడినట్లు నిర్ధారణ అయిన తరువాత రోజువారిగా తీసుకునే ఆహారం జాబితా నుండి తగ్గించుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాలలో ఒకటి బంగాళాదుంపలు. బంగాళ దుంప అనేది ఒక పిండి కూరగాయ. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ప్రధానమైన ఆహారం. అయితే మధుమేహంతో బాధపడుతున్న వారికి మాత్రం అకస్మాత్తుగా అనారోగ్యకరంగా మారుతుంది. సాధారణంగా, బంగాళాదుంపలు దాని అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్  చక్కెర స్థాయిని పెంచుతుంది.

కార్బోహైడ్రేట్లను తిన్నప్పుడు, మన శరీరం దానిని గ్లూకోజ్ అని పిలిచే సాధారణ చక్కెరగా మారుస్తుంది. గ్లూకోజ్ అణువులు మన రక్తప్రవాహంలోకి ప్రవేశించి మన రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఇన్సులిన్‌ను తగినంత మొత్తంలో ఉత్పత్తి చేస్తాడు, ఈ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించడానికి, శక్తిగా వినియోగించబడటానికి అనుమతించే హార్మోన్. డయాబెటిక్ రోగులు ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయనందున, గ్లూకోజ్ అణువులు కణంలోకి ప్రవేశించడంలో విఫలమవుతాయి. దీంతో రక్తంలోనే ఉంటాయి, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

కాబట్టి బంగాళాదుంపలు మధుమేహ రోగులకు చెడుతలపెట్టకపోయినప్పటికీ ఇది ఒక పిండి పదార్ధం. మధుమేహ రోగి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా వాటిని తీసుకోవచ్చు. అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. బంగాళాదుంపలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచుతుంది. ఇందులో జింక్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ బి మరియు విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిక్ వ్యక్తి ప్రతిరోజూ చాలా తక్కువ 20-50 గ్రాములు నుండి ఒక మోస్తరు 100- 150 గ్రాములు మొత్తంలో పిండి పదార్థాలు తీసుకోవచ్చు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ మొత్తం మారుతుంది.

ఒక చిన్న బంగాళాదుంపలో 30 గ్రాముల పిండి పదార్థాలు మరియు పెద్ద బంగాళదుంపలో సుమారు 65 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. అయితే, బంగాళాదుంపలను ఆహారంగా తీసుకునే విధానాన్ని బట్టి సంఖ్య మారుతుంది. అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవడం నియంత్రించడానికి, ఉడికించిన, కాల్చిన, వేపిన బంగాళాదుంపలను తీసుకోవటం బెటర్. బీన్స్ వంటి ఇతర ఫైబర్-రిచ్ కూరగాయలతో బంగాళాదుంపలను ఉడికించాలి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను కూడా నివారిస్తుంది.

బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు నియంత్రణ నియమాలను అనుసరించడం ముఖ్యం. డయాబెటిక్‌గా ఉన్నప్పుడు పిండి పదార్ధాలను సాధ్యమైనంత వరకు తక్కువ మోతాదులో తీసుకోవటం మీ ఆరోగ్యానికి మంచిది.