Papaya Fruit : బొప్పాయిని ఈ పండ్లు, పదార్దాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవా?

బొప్పాయికి వేడి చేసే గుణం ఉంటే, పెరుగుకు చలువ చేసే గుణం ఉంటుంది. కాబట్టి బొప్పాయి తిన్న వెంటనే పెరుగు తినడం మానేయాలి. బొప్పాయి తిన్నతర్వాత పెరుగు తినాలనిపిస్తే.. రెండు గంటల తర్వాత తింటే మంచిది. చలువ చేసే, వేడి చేసే ఆహారం కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది.

Papaya Fruit : బొప్పాయిని ఈ పండ్లు, పదార్దాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవా?

papaya

Papaya Fruit : బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులోనున్నాయి. బొప్పాయిలో విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఆల్ఫా, బీటా, కెరోటిన్, ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంచుతాయి. బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని విటమిన్‌-సి దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు. కొలెస్ట్రాల్‌ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 60, డైటరీ ఫైబర్ ఉన్నందున, ఫిట్‌నెస్ నిపుణులు ప్రతిరోజూ బొప్పాయిని తినమని సిఫార్సు చేస్తున్నారు. బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ అలర్జీలతో పోరాడుతుంది, గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, బొప్పాయి కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తిసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బొప్పాయికి వేడి చేసే గుణం ఉంటే, పెరుగుకు చలువ చేసే గుణం ఉంటుంది. కాబట్టి బొప్పాయి తిన్న వెంటనే పెరుగు తినడం మానేయాలి. బొప్పాయి తిన్నతర్వాత పెరుగు తినాలనిపిస్తే.. రెండు గంటల తర్వాత తింటే మంచిది. చలువ చేసే, వేడి చేసే ఆహారం కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది. బొప్పాయి, నిమ్మకాయను కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు సలాడ్‌లో బొప్పాయిని తింటుంటే, దానిపై నిమ్మరసం వేసుకోవద్దు. ఇది విషపూరితం కావచ్చు. నిమ్మకాయ, బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఉంది.

కివి పండు, బొప్పాయి కలిపి తీసుకోరాదు. కివీని బొప్పాయితో కలిపి తింటే ఆరోగ్యం పాడవుతుంది. కివీ పుల్లగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పండ్లను ఎప్పుడూ కలిపి తినకూడదు. ఆరెంజ్‌ కూడా సిట్రస్‌ పండు. ఫ్రూట్‌ సలాడ్‌‌‌లో ఆరెంజ్‌, బొప్పాయి కలిపి తినకూడదు. ఇది విషంలా మారి మీ ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది. అలాగే బొప్పాయి, టమాటా కాంబినేషన్‌ మంచిది కాదు. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే విషంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే బొప్పాయి, టొమాటో కలిపి తినకూడదు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు వైద్యులను సంప్రదించటం మంచిది.