Diabetes : ఈ లక్షణాలు ఉంటే షుగర్ వ్యాధికి సంకేతమా?…

షుగర్‌ వ్యాధిని నోట్లో కనిపించే కొన్ని లక్షణాల బట్టీ కూడా తొలినాళ్లలోనే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నోరు తడారిపోవడం మధుమేహానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అవును, మధుమేహం వ్య

Diabetes : ఈ లక్షణాలు ఉంటే షుగర్ వ్యాధికి సంకేతమా?…

Shugar

Diabetes : డయాబెటిస్ లేదా మధుమేహం, షుగర్..ఏ పేరుతో పిలిచినా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బాధితులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా చిన్న వయసు వారు సైతం డయాబెటిస్ బారిన పడుతుండడం ఇటీవలికాలంలో ఆందోళన రేకెత్తిస్తుంది. గంటల తరబడి కూర్చోని ఉండటం, శారీరక శ్రమ లేక పోవడం, పోషకాల కొరత, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు తీసుకోవడం, పరిమితికి మించి తీనటం, చిన్నచిన్న ఆరోగ్యసమస్యలకు ఎక్కువ మోతాదులో మందుల వాడకం, ఊబకాయం, జీవన శైలిలో మార్పులు ఇలా వివిధ రకాల కారణాల వల్ల మధుమేహం బారిన పడుతున్నారు.కొందరిలో వంశపారంపర్యంగా డయాబెటిస్ వస్తుంది. తొలిదశలో వ్యాధిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. పూర్తిగా నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది.

షుగర్‌ వ్యాధిని నోట్లో కనిపించే కొన్ని లక్షణాల బట్టీ కూడా తొలినాళ్లలోనే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నోరు తడారిపోవడం మధుమేహానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అవును, మధుమేహం వ్యాధి ఏర్పడినప్పుడు శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. అందు వల్లనే ఎంత నీరు తీసుకున్నా తరచూ నోరు తడారి పోవడం, అధిక దాహం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తారు. అలాగే చిగుళ్ల నుంచి రక్తం రావడం కూడా డయాబెటిస్‌ మొదటి దశలో కనిపించే లక్షణంగా చెప్పుకోవచ్చు. నాలుకపై తెల్లని పూతలా ఏర్పడం, నోట్లో తరచూ పుండ్లు ఏర్పడటం, దంత క్షయం, చిగుళ్ల వాపులు, ఆహారం నమలడం మరియు మింగడంలో ఇబ్బందులు వంటి కూడా మధుమేహం తొలి నాళ్లలో కనిపించే లక్షణాలు.

శరీరంపై గాయాలలైతే అంతతేలికగా మానవు. దీనితోపాటు అతిగా ఆకలి వేస్తుంది. కాళ్లలో స్పర్శ తగ్గుతుంది కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి. రక్తంలో చక్కెరల స్థాయులు మోతాదుకు మించి పెరిగితే మధుమేహం ఉన్నట్లేనని గుర్తించవచ్చు. చాలామందిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం, శృంగార కోరికలు సన్నగిల్లడం, చర్మం ముడత పడటం వంటి లక్షణాలు షుగర్ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ తరహా లక్షణాలు గుర్తించిన వెంటనే సమీపంలోని వైద్య నిపుణులను సంప్రదించి దానికి సంబంధించిన చికిత్స పొందటం మంచిది.