Thyroid Problems : థైరాయిడ్‌ సమస్యలు పురుషులలో కంటే స్త్రీలలోనే ఎక్కువా?

ఆదుర్దా, ఇరిటేషన్‌, ఒణుకు, అసందర్భంగా చెమట పట్టడం, వేడిని భరించలేకపో వడం, గుండెకొట్టు కోవడం క్రమం తప్పడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు హైపర్‌ థైరాయిడిజంలో కనిపించవచ్చు.

Thyroid Problems : థైరాయిడ్‌ సమస్యలు పురుషులలో కంటే స్త్రీలలోనే ఎక్కువా?

Thyroid

Thyroid Problems : థైరాయిడ్‌ గ్రంథి సమస్యలు మగవారితో పోల్చి చూసినప్పుడు ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అనారోగ్యం బారిన పడిన సందర్భంలో నిర్వహించే పరీక్షల వల్ల థైరాయిడ్‌ సమస్యల్ని గుర్తిస్తుంటారు. ప్రధానంగా థైరియిడ్‌కి సంబంధించి హైపోథైరాయిడిజమ్‌, హైపర్‌ థైరాయి డిజమ్‌, థైరాయిడ్‌ కాన్సర్స్‌ వంటి సమస్యలు వస్తుంటాయి. థైరాయిడ్‌ గ్రంథి నుంచి హార్మోన్‌ ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడిజమ్‌ అంటారు. హైపోథైరాయిడిజమ్‌ ఉన్న వాళ్ళు త్వరగా అలసి పోతుంటారు. బాగా నీరసించి పోతుంటారు. ముఖం ఉబ్బరించటం, జుట్టు రాలిపోవటం , డ్రైస్కిన్‌, ఒళ్ళు నొప్పుడు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్ధితి ఉంటే పరీక్షలు చేయించుకుని నిర్దారించుకోవాలి.

శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి వల్ల ఎక్కువగా హైపోథైరాయి డిజమ్‌ వచ్చే అవకాశముంది. ఆడవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కచ్చిత మైన మందులతో హైపోథైరాయిడిజమ్‌ని అదుపులోకి తేవ చ్చు. హైపర్‌ థైరాయి డిజమ్‌ ఉన్న వాళ్ళు గర్భం ధరించాలనుకుంటే ఎండోక్రినాలజిస్ట్‌ సలహా అవసరం. మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఎక్కువ. గొంతు దగ్గర వాపు కనిపించడం థైరాయిడ్‌ లక్షణం దానికి నొప్పి ఉండదు. ఇతర క్యాన్సర్స్‌లాగే దీనికి చికిత్స అందిస్తారు. అయితే ప్రాధమిక దశలో గుర్తించటం వల్ల మెరుగైన చికిత్స అందించవచ్చు.

హైపోథైరా యిడిజమ్‌ ఉన్న వాళ్ళకి గర్భ సమయంలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఎండోక్రెనాలజిస్ట్‌ సలహా తీసుకోవ డం చాలా అవసరం.థైరాయిడ్‌ గ్రంథి ఎక్కువగా పనిచేయడం వల్ల హైపర్‌ థైరాయిడిజమ్‌ కలుగవచ్చు. ఆదుర్దా, ఇరిటేషన్‌, ఒణుకు, అసందర్భంగా చెమట పట్టడం, వేడిని భరించలేకపో వడం, గుండెకొట్టు కోవడం క్రమం తప్పడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు హైపర్‌ థైరాయిడిజంలో కనిపించవచ్చు. అధిక మొత్తంలో అయోడిన్ తీసుకోవటం వల్ల అది హైపర్ థైరాయిడిజానికి దారి తీస్తుంది. థైరాయిడ్ గ్రంధిపై గడ్డలు ఏర్పడటం వల్ల సైతం హార్మోన్ల అధిక స్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్ధితి మగవారి కంటే ఆడవారిలోనే అధికంగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంధిలో దీర్ఘకాలం పాటు ఏర్పడే ఆటో ఇమ్మ్యూన్ రుగ్మత, వాపును కలిగిస్తుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును నిరోధిస్తుంది.