Alcohol : మద్యం అలవాటుందా!…అయితే ఈ సమాచారం మీకోసమే?..

మద్యపానీయం సేవించే వారిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది.

Alcohol : మద్యం అలవాటుందా!…అయితే ఈ సమాచారం మీకోసమే?..

Alcohol

Alcohol : ఇటీవల కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. పట్టణాలతోపాటు గ్రామాలలో కూడా మద్యపానం తాగుతున్నవారు ఎక్కవగానే ఉంటున్నారు. ముఖ్యంగా పల్లెవాసులు తాగుడుకు బానిసలై కుటుంబపరంగా , ఆరోగ్యపరంగా అనర్థాలకు గురవుతున్నారు. ముఖ్యంగా మగవారిలో మద్యపానం వల్ల వారికి అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టి కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అవుతున్న ఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. మద్యం సేవించడం వలన చాలా శరీర భాగాలకు హాని కలుగుతుంది.

మద్యపానం సమస్యలు ;

జీర్ణకోశం వ్యాధులు: ఆల్కహాల్‌లో ఉండే హానికరమైన పదార్ధాల కారణంగా కాలేయం దెబ్బ తింటుంది. కొవ్వు పేరుకోవడం వల్ల కాలేయం పెరుగుతుంది. ఉదయం పూట వికారంగా ఉండి వాంతి వస్తున్నట్టు ఉంటుంది. నీళ్ళ విరోచనాలు అవుతాయి. పొత్తి కడుపు కుడి వెైపు పెైభాగాన నొప్పిగా ఉంటుంది. కాలేయం వాపు వస్తుంది. ఇది ముదిరే కొద్ది కామెర్లు వస్తాయి. మద్యపానం వల్ల పేగులు, పాన్‌క్రియాస్‌ కూడా బాగా దెబ్బ తింటాయి. మద్యం సేవించే వారిలో బి1 లోపం వల్ల గుండెలోని కండరాలకు హాని కలిగి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.

మద్యపానీయం సేవించే వారిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణంలో లోపం ఏర్పడుతుంది. మద్యం తాగే వారిలో మెదడు మందగిస్తుంది. నరాలలో శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా బి విటమిన్ల లోపం వల్ల మద్యపానం మెదడుపెై పొరలపెై చెడు ప్రభావం చూపుతుంది. నడక తిన్నగా ఉండదు. మాట తడబడు తుంది. కళ్ళ కదలికలో లోపం ఉంటుంది. మానసికంగా కృంగిపోతారు. పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

పరుషుల్లో మద్యపానం వల్ల లెైంగిక వాంఛ తగ్గిపోతుంది. నపుంసకత్వం ఏర్ప డుతుంది. ఆల్కహాల్ తాగితే జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసావయవాలు, క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కాలేయం క్యాన్సర్‌కు మద్యపానానికి దగ్గరి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. కోన్ని సందర్భాల్లో అకాల మరణానికి మద్యం కారణమౌతుంది. మద్యపానం అలవాటుగా చేసుకోవటం వల్ల అనేక రకరకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.